Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు పాన్ ఇండియాలో భారీ విజయాలను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా మంది దర్శకులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక పాన్ ఇండియా హీరోలతో భారీ విజయాలను అందుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తుంటే మరి కొందరు మాత్రం బాలీవుడ్ హీరోలతో సినిమాలను చేసి భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘గబ్బర్ సింగ్’ (Gabbar Sing) లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన హరీష్ శంకర్ లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Sing) సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అయిన సల్మాన్ ఖాన్ (Salman Khan) తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఆయనకు కథను కూడా వినిపించారట.
Also Read : హరీష్ శంకర్ తో వెంకటేష్..మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటి!
కథ కూడా ఓకే చేసిన సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా మరోసారి తన పేరు ప్రఖ్యాతలను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంలో సల్మాన్ ఖాన్ అయితే ఉన్నాడు.
ఇక రీసెంట్ గా మురుగదాస్ (Murugadas) డైరెక్షన్ లో చేసిన సికిందర్ (Sikindar) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు ఆయన హరీష్ శంకర్ (Harish Shankar)తో సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ టెంప్లేట్ లోనే ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక హరీష్ శంకర్ సైతం రవితేజ తో చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా విషయంలో హరీష్ కొంత లేట్ చేసినప్పటికి పవన్ కళ్యాణ్ ద్వారా మరికొంత లేట్ అయితే అవుతుంది. తద్వారా ఆ ప్రాజెక్టు పక్కన పెట్టి సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసి వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : వెంకటేష్ తో సినిమా సెట్ చేసుకుంటున్న సీనియర్ డైరెక్టర్…