spot_img
Homeక్రీడలుక్రికెట్‌Abhishek Sharma batting: కొడితే విధ్వంసం.. లేకుంటే సర్దుకోవడం.. ఏంటి భయ్యా ఇది

Abhishek Sharma batting: కొడితే విధ్వంసం.. లేకుంటే సర్దుకోవడం.. ఏంటి భయ్యా ఇది

Abhishek Sharma batting: మా వాడు కనక లేచాడు అంటే అసలు ఆగడు. కానీ లేవడమే కష్టం.. అప్పట్లో విపరీతమైన పాపులర్ అయిన ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. ఈ డైలాగు ప్రస్తుత ఐపిఎల్ లో హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మకు నూటికి నూరు శాతం సరిపోతుంది. ఒక మ్యాచ్లో గట్టిగా ఆడతాడు. మేనేజ్మెంట్ అతని మీద బలమైన అంచనాలు పెట్టుకుంటుంది. ఆ తదుపరి మ్యాచ్లో సున్నా కే అవుట్ అవుతాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అయ్యి దారుణంగా నిరాశ పరుస్తాడు.

ఇటీవల టి20 వరల్డ్ కప్ లో ఇలానే ఆడాడు. మేనేజ్మెంట్ వరుసగా అవకాశాలు ఇచ్చినప్పటికీ ఉపయోగించుకోలేకపోయాడు. ఫైనల్ మ్యాచ్లో సత్తా చూపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పటికే అతడికి రెడ్ కార్డ్ జారీ అయ్యేది.. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడుతున్న అతడు.. గొప్ప ఇన్నింగ్స్ నిర్మిస్తాడని.. భారీగా పరుగులు చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు విఫల ప్రదర్శన చేస్తున్నాడు. ఒక మ్యాచ్లో గొప్పగా ఆడితే చాలు.. తదుపరి మ్యాచ్లో దారుణంగా నిరాశ పరుస్తున్నాడు. అసలు ఇలాంటి అస్థిరమైన ఆటను ఎందుకు ఆడుతున్నాడనేది అర్థం కావడం లేదు. బంతిని అంచనా వేయడంలో విఫలమవుతున్నాడు. టార్గెట్ బంతులకు బలవుతున్నాడు. సోమవారం నాటి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ త్వరగా నే వికెట్ పడేసుకున్నాడు.. వాస్తవానికి ఇషాన్ కిషన్ నిలబడ్డాడు కాబట్టి సరిపోయింది. అతడు గనుక ఆడక పోతే హైదరాబాద్ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

అభిషేక్ శర్మ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలి బంతికే బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ ఏడాది 18 t20 ఇన్నింగ్స్ లలో అభిషేక్ శర్మకు ఇది ఏడవడకౌట్. ఐదుసార్లు 50 ప్లస్ పరుగులు చేశాడు. అతని తర్వాత కనోలి 17 ఇన్నింగ్స్ లలో నాలుగు సార్లు డక్ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తే విధ్వంసం.. లేకుంటే బ్యాగ్ సర్దేద్దాం అన్నట్టుగా ఉంది.

ప్రారంభం నుంచి దూకుడుగా ఆడాలనే మొదటి తాపత్రయం మెచ్చుకో దగినది అయినప్పటికీ.. అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే పిచ్ ను చూసి.. బంతి గమనాన్ని చూసి ఆటగాడు ఆడాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్ చేస్తానంటే కుదరదు. టి20 లలో పరుగులు తీయడం అన్ని సందర్భాలలో సాధ్యం కాదు. బంతి బ్యాట్ మీదికి వచ్చినప్పుడు మాత్రమే పరుగులు తీయడం సాధ్యమవుతుంది. ఒకవేళ అలా బంతి రాని పక్షంలో బ్యాటర్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.. బంతి విషయంలో స్పష్టమైన అవగాహనను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది.

అభిషేక్ శర్మ విషయంలో దూకుడు మాత్రమే కనిపిస్తోంది . బంతి గమనాన్ని అంచనా వేయడంలో అతడు విఫలమవుతున్నాడు. కొన్ని సందర్భాలలో అతడు సరిగ్గానే ఆడుతున్నాడు. మిగతా సందర్భాల్లో మాత్రమే విఫలమవుతున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో అతడు అవుట్ కావడం నిరాశ పరుస్తోంది. సోమవారం నాటి మ్యాచ్లో అతడు గనుక నిలబడి ఉంటే.. హైదరాబాద్ జట్టు మరింత భారీ స్కోర్ చేసి ఉండేది. అందువల్లే అభిషేక్ శర్మ తన ఆట తీరు మార్చుకోవాలి. ముఖ్యంగా బంతి గమనాన్ని అంచనా వేయాలి. హైదరాబాద్ మేనేజ్మెంట్ కూడా ఇదే కోరుకుంటున్నది. మరి వచ్చే మ్యాచ్లో అభిషేక్ శర్మ ఏం చేస్తాడో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version