Abhishek Sharma: ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం రాత్రి జరిగిన తొలి t20 మ్యాచ్లో.. ఇంగ్లాండ్ జట్టుపై భారత్ ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ( youngest team India opener Abhishek Sharma) సరికొత్త చరిత్ర సృష్టించాడు.. కోల్ కతా మైదానాన్ని సిక్సర్లతో హోరెత్తించాడు. 34 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. కేవలం 20 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేశాడు.
20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. చివరికి తన గురువు యువరాజ్ సింగ్ (Yuvraj Singh) రికార్డులను కూడా కాలగర్భంలో కలిపేశాడు.. టి20 క్రికెట్లో టార్గెట్ చేసే క్రమంలో అత్యంత వేగంగా (70+ పరుగులు) రన్స్ చేసిన టీమిండియా ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. 2013లో యువరాజ్ సింగ్ 35 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అప్పుడు అతడి స్ట్రైక్ రేట్ 220 గా ఉంది. అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లోనే 79 పరుగులు చేయడంతో పాటు 232.35 స్ట్రైక్ రేట్ సాధించాడు. తద్వారా యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు.. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుపై ఓ టి 20 మ్యాచ్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. 2007లో టి20 ప్రపంచ కప్లో భాగంగా యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై 7 సిక్సర్లు కొట్టాడు. బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.
వేగవంతమైన హాఫ్ సెంచరీ
టి20 క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టుపై వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టుపై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ జట్టుపై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించాడు.. ఇక యువరాజు సింగ్ తర్వాత 2018లో మాంచెస్టర్ వేదికగా జరిగిన టి20 మ్యాచ్లో ఇంగ్లాండ్ పై కేఎల్ రాహుల్ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును కూడా అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. రాహుల్ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రస్తుతం టీమిండియా తరఫున ఇంగ్లాండ్ జట్టుపై టి20 లలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు.. ఇక టి20 మ్యాచ్ లో భారత గడ్డపై అత్యంత వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. 2022లో సౌత్ ఆఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ గౌహతి వేదికగా టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో 225.53 స్ట్రైక్ రేటుతో 106* పరుగులు చేశాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ 232.35 స్ట్రైక్ రేట్ తో 79 పరుగులు చేయడం విశేషం.