Abhinav Manohar: సన్ రైజర్స్ హైదరాబాద్ (sun rises Hyderabad) జట్టు యజమాని కావ్య మారన్(kavya maran) అంటే చాలామందికి ఇష్టం. ఐపీఎల్ చూసేవాళ్ళు ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె గురించి తెలుసుకుంటూ ఉంటారు. కావ్య తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉంటాయని చెబుతుంటారు. కానీ ఈసారి కావ్య వారి అంచనాలను అందుకోలేకపోతోంది. అంతేకాదు, ఊహించని నిర్ణయాలు తీసుకొని అందరికీ షాక్ ఇస్తోంది.
ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. అన్ని జట్ల యాజమాన్యాలు మాత్రం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఇందులో హైదరాబాద్ జట్టు కూడా ఉంది. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య 2026 సీజన్ విషయంలో జాగ్రత్తగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆమె పకడ్బందీగా వ్యవహరించింది. ఇంతవరకు ఎవరికి ఎటువంటి అనుమానాలు ఆమె మీద లేవు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి కావ్య తీసుకున్న నిర్ణయం అభిమానులకు షాక్ కలిగిస్తోంది…
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమ్ముడు పోని ప్లేయర్లలో అభినవ్ మనోహర్ ఒకడు. అయితే ఇప్పుడు అతడు విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ము రేపుతున్నాడు. నాలుగు మ్యాచ్ లు ఆడిన అతడు 176 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 90 బంతులు ఎదుర్కొన్న అతను, 176 పరుగులు చేశాడు. మొత్తంగా తొమ్మిది సిక్సర్లు, 17 ఫోర్లు కొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒకసారి కూడా అభినవ్ అవుట్ కాలేదు.
అభినవ్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడు. 2025 లో హైదరాబాద్ యాజమాన్యం అతడిని 3.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతడిని రిజర్వ్ బెంచ్ కు మాత్రమే పరిమిత చేసింది. 2026 ఐపీఎల్ మినీవేలానికి ముందు హైదరాబాద్ జట్టు మనోహర్ ను రిలీజ్ చేసింది. అయితే మనోహర్ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో అతడిని రిలీజ్ చేసి కావ్య తప్పు చేసిందని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు..
విజయ్ హజారే ట్రోఫీలో అభినవ్ కర్ణాటక జట్టు తరుపున ఆడుతున్నాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడానికి వస్తున్న అతడు దుమ్మురేపుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్లో అతడు ఝార్ఖండ్ పై 56 రన్స్ చేశాడు. కేరళ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తమిళనాడు జట్టుతో జరిగిన మ్యాచ్లో 20 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. పుదుచ్చేరి జట్టుపై 21 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. త్రిపుర జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 79 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.