SA vs AUS WCL ABD Performance: వయసు పైబడుతున్నా కొద్దీ ఆటగాళ్లలో మునుపటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకప్పటిలాగా ఆడే అవకాశం లేకుండా పోతుంది. కానీ ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ ఉండడు. ప్రస్తుతం అతడి వయసు 41 సంవత్సరాలు. వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని.. తనలో ఉత్సాహం ఇంకా ఒకప్పటి మాదిరిగానే ఉందని అతడు నిరూపిస్తున్నాడు. డబ్ల్యూ సీ ఎల్ లో అతని ఫీల్డింగ్ విన్యాసం సఫారి జట్టుకు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టింది. ఉత్కంక సాగిన మ్యాచ్ లో ప్రత్యర్థి కంగారు జట్టుకు ఓటమిని మిగిల్చింది.
Also Read: కీలక బౌలర్ కు గాయం.. ఇంగ్లాండ్ కు ఇది మామూలు షాక్ కాదు..
డబ్ల్యూ సీ ఎల్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా గట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అధ్యంతం ఉత్కంఠ గా సాగింది. చివరి బంతికి ఆస్ట్రేలియా మూడు పరుగులు చేయాల్సిన సమయంలో.. సఫారీ జట్టు ఆటగాడు దివిలియర్స్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. దీంతో ఒక పరుగు తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ముందుగా ఈ మ్యాచ్లో సఫారీ జట్టు బ్యాటింగ్ చేసింది. స్మట్స్ 57, వాన్ విక్ 76 పరుగులు చేయడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన కంగారు జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ.. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.
Also Read: నిజమైన దేశభక్తి అంటే మీదే.. నిజంగా ‘లెజెండ్స్’ అనిపించుకున్నారు
చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా ఆటగాడు బౌండరీ లక్ష్యంగా భారీ షాట్ కొట్టాడు. కాకపోతే ఆ బంతి డివిలియర్స్ చేతిలోకి వెళ్ళింది. అతడు మరో మాటకు తావులేకుండా నేరుగా విసిరేశాడు. దీంతో ఆ బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. అప్పటికే ఆస్ట్రేలియా బ్యాటర్ క్రీజ్ లోకి రాలేదు. దీంతో బంతి అందుకున్న ఫీల్డర్ వికెట్ ను నేల కూల్చాడు. దీంతో ఆస్ట్రేలియా ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కీలక సమయంలో అద్భుతంగా ఫీల్డింగ్ చేసి మిస్టర్ 360 ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.. ఈ విజయం ద్వారా సౌత్ ఆఫ్రికా ఫైనల్ వెళ్లిపోయింది. భారత్ ఆడక పోవడంతో దాయాది జట్టు ఇప్పటికే ఫైనల్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ తలపడతాయి.
Australian Legends needed 3 runs off 1 ball & AB de Villiers pulled off a perfect throw to take South Africa legends to the finals of the WCL 2025.
Talk about clutchnessss.pic.twitter.com/3sJyALTf9e
— . (@ABDszn17) July 31, 2025