Mohan Babu Case: మంచు కుటుంబం గత ఏడాది నుండి ఎదో ఒక కారణంతో మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు మనోజ్(Manchu Manoj) తో ఏర్పడిన వివాదాలే అందుకు కారణం. ఇప్పటికీ ఈ వివాదాలు సర్దుకోలేదు. కోర్ట్ లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. తుది తీర్పు ఎప్పుడొస్తాడో ఏమో తెలియదు కానీ, చాలా కాలం నుండి మోహన్ బాబు(Manchu Mohan babu) మరియు ఆయన కుమారుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఎదురుకుంటున్న మరో కోర్టు కేసు నుండి సుప్రీమ్ కోర్ట్ రిలీఫ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వ హయాం లో, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదని, వీళ్లిద్దరు కలిసి 2019 మార్చి 22న విద్యానికేతన్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్టూడెంట్స్ తో కలిసి భారీ ఎత్తున ధర్నాలు చేశారు. తిరుపతి, మదనపల్లి రోడ్డు పై చేసిన ఈ ధర్నా కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి జనాలు చాలా ఇబ్బందికి గురయ్యారని, అప్పట్లో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ని కూడా ఉల్లఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: పెళ్లి కాకుండానే ఆడ – మగ కలిసే ఉండవచ్చు.. ఇదేం కల్చర్ రా నాయనా!
దీంతో మోహన్ బాబు తాము శాంతియుతంగా ధర్నాలు చేసుకున్నప్పటికీ, పోలీసులు తప్పుడు అభియోగాలతో తమ కేసు ని నమోదు చేసారని, ఎన్నికల కోడ్ తమకు వర్తించదు అని తెలిసినప్పటికీ కూడా ఈ కేసు వేసినందుకు కొట్టివేయాలని గతంలో హై కోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ కేసు కి సంబంధించిన విచారణ, నిజానిజాల నిర్ధారణ ముందుగా ట్రైలర్ కోర్టు లోనే జరగాలని చెప్తూ మోహన్ బాబు పిటీషన్ ని హై కోర్టు క్వాష్ చేసింది. హై కోర్టు తీర్పుని సవాలు చేస్తూ , మోహన్ బాబు ఈ ఏడాది మార్చి 3న సుప్రీమ్ కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ నెల 22 వ తారీఖున ఈ ఇరుపక్షాల వాదనలను విని వాయిదా వేసిన సుప్రీమ్ కోర్టు, నిన్న(గురువారం) తుది తీర్పు ని ఇచ్చింది.
Read Also: సీఎం రేవంత్ కే ఎసరు పెట్టిన పంచాయితీ కార్యదర్శి?
చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో 2019 మార్చి 23న పోలీసుల చేత నమోదు చేయబడ్డ FIR ని కొట్టివేస్తూ, అసలు ఈ సెక్షన్స్ వీళ్ళకి ఎలా వర్తిస్తాయని పోలీసులను మందలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదు లో మోహన్ బాబు, మంచు విష్ణు జనాలను ఇబ్బంది పెడుతూ ధర్నాలు చేసినట్టు, ట్రాఫిక్ సమస్య క్రియేట్ అయ్యేలా చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీమ్ కోర్ట్ ఈ కేసుని కొట్టివేసింది. దీంతో మోహన్ బాబు కి పెద్ద రిలీఫ్ దొరికినట్టు అయ్యింది. 2019 సమయం లో చంద్రబాబు హయాం లో ఈ ఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రభుత్వమే ఉండడం తో కేసు ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసారని అంటున్నారు.