Aaron Jones: వారెవ్వా జోన్స్.. ఒక్క మ్యాచ్ లోనే గేల్, యువి రికార్డులను మడత పెట్టేశాడుగా..

ప్రారంభ మ్యాచ్లో అమెరికా, కెనడా జట్లు పోటాపోటీగా పరుగులు చేశాయి. టాస్ గెలిచినప్పటికీ అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 2:16 pm

Aaron Jones

Follow us on

Aaron Jones: ఊహించినట్టుగానే టి20 వరల్డ్ కప్ ధాటిగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లోనే పరుగుల వరద పారింది. అభిమానులు ఆశించినట్టుగానే బ్యాటర్లు తాండవం చేశారు. అంతేకాదు తొలి మ్యాచ్లోనే అమెరికా థ్రిల్లర్ మ్యాచ్ ను ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించింది. అసలు ఏమాత్రం ఆశలు లేని స్థాయి నుంచి విజయతీరాలకు వెళ్లి.. అదరగొట్టింది. కెనడాపై ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాదు గ్రూప్ ఏ విభాగంలో రెండు పాయింట్లతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.

ప్రారంభ మ్యాచ్లో అమెరికా, కెనడా జట్లు పోటాపోటీగా పరుగులు చేశాయి. టాస్ గెలిచినప్పటికీ అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని అమెరికా 17.4 ఓవర్లలో 197 రన్స్ కొట్టి.. ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.. అయితే ఈ మ్యాచ్లో బ్యాటర్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ అదిరిపోయే బ్యాటింగ్ తో అలరించాడు. 10 సిక్స్ లు కొట్టి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్లో సంచలన ఆటగాళ్లుగా అనేక రికార్డులు సృష్టించిన టీమిండియా స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజం గేల్ ఘనతలను మడత పెట్టాడు. టి20 వరల్డ్ కప్ చరిత్రలో చేదనలో అత్యధిక స్కోర్ సాధించిన నాన్ ఓపెనర్ గా జోన్స్ రికార్డు సృష్టించాడు. అత్యధిక సిక్సర్లు(10) కొట్టిన నాన్ ఓపెనర్ గా ఘనతను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు రొసో పేరు మీద ఉండేది. రోసో ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు. టి20 వరల్డ్ కప్ లో ఓవరాల్ గా ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండవ ఆటగాడిగా జోన్స్ నిలిచాడు.

పొట్టి ప్రపంచ కప్ లో గేల్ ఇంగ్లాండ్ జట్టుపై 11 సిక్స్ లు, సౌత్ ఆఫ్రికా పై 10 సిక్స్ లు కొట్టాడు. గేల్, జోన్స్ 10 సిక్స్ ల తర్వాత స్థానాలలో రోసో 8, యువరాజ్ సింగ్ 7, డేవిడ్ 7 సిక్స్ లతో వార్నర్ ఉన్నారు. జోన్స్ గత కొంతకాలం నుంచి అదిరిపోయే ఆటతీరుతో అలరిస్తున్నాడు. బౌలర్ ఎంతటి వాడైనా భయం లేకుండా దూకుడైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.. తొలి మ్యాచ్ ద్వారానే అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన జోన్స్.. ప్రత్యర్థి జట్లకు ప్రమాద హెచ్చరికలు పంపాడు.