Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీChina: జాబిల్లిని దాటిన డ్రాగన్‌ కంటే.. అంతరిక్ష పరిశోధనలో రికార్డు!

China: జాబిల్లిని దాటిన డ్రాగన్‌ కంటే.. అంతరిక్ష పరిశోధనలో రికార్డు!

China: చైనాకు చెందిన లూనార్‌ ల్యాండర్‌ చాంగే–6 విజయవంతగా జాబిల్లి అవతలివైపు ల్యాండ్‌ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకటించింది. చైనా కాలమానం ప్రకారం.. ఆదివారం(జూన్‌ 2)న ఉదయం అయిట్కిన్‌ బేసిన్‌ పేరిట ఉన్న ప్రదేశంలో సురక్షితంగా ఉపరితలాన్ని తాకినట్లు పేర్కొంది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక కీలక ముదడుగు. ఇప్పటి వరకు ప్రయోగించిన వాటిలో ఇదే అత్యాధునికమైంది. ఇక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరుతుంది. గతంలో 2019లో కూడా చాంగే – 4ను చైనా చంద్రుడి ఆవలివైపునకు ప్రయోగించింది. తాజాగా పంపిన మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ మాడ్యూల్‌ అనే నాలుగు రకాల పరికరాలు ఉన్నాయి.

నెల క్రితం ప్రయోగం..
చాంగే–6ను మే 3న చైనా ప్రయోగించింది. దాదాపు 33 రోజులపాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. ఇక్కడ రోబోల సాయంతో తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టిని భూమిపైకి తీసుకువస్తుంది. ఇందుకోసం 14 గంటల సమయం పడుతుంది. తర్వాత అసెండర్‌ మాడ్యూల్‌ చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళ్తుంది. చంద్రుడి కక్ష్యలోని ఆర్బిటర్‌తో అనుసంధానం అవుతుంది. తర్వాత ఈ శాంపిళ్లు ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్‌. చందమామ ఉపరితలం నుంచి పైకి దూసుకెళ్తుంది. చంద్రుడి కక్ష్యలోకి ఆర్బిటర్‌తో అనుసంధానం అవుతుంది. అనంతరం ఈ శాంపిళ్లు ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్‌లోకి చేరుతాయి.

భూమి దిశగా ఆర్బిటర్‌…
ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆర్బిటర్‌ భూమి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. భూమికి చేరువయ్యాక రీఎంట్రీ మాడ్యూల్‌ ఆర్బిటర్‌ నుంచి విడిపోతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చైనాలోని ఇన్నర్‌ మగోలియా అటానమస్‌ ప్రాంతంలో రీ ఎంట్రీ మాడ్యూల్‌ దిగుతుంది. చాంగే – 6తో కమ్యూనికేషన్లు సాగించడానికి ప్రత్యక ఉపగ్రహాన్ని చంద్రుడి కక్షలోకి చైనా ఇప్పటికే పంపింది. ఈ ప్రయోగం విజయవంతడం కావడంతో 2030న అక్కడికి వ్యోమగాములను పంపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

చంద్రుడి అవతలి నమూనాలు..
చంద్రుడికి సంబంధించి మనకు ఎప్పుడూ కనిపించే అవతలి భాగం నుంచి చైనా ఇప్పటికే నమూనాలు సేకరించి భూమికి తెచ్చింది. అవతలి భాగం నుంచి వీటిన ఇతీసుకురావడం సంక్షిష్ట ప్రక్రియ. ఉపరితలం ఎగుడుదిగుడుగా ఉంటుంది. తాజా యాత్ర ద్వారా అక్కడి వాతావరణంతోపాటు శిలలు, ధూళిలోని పదార్థాల గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా భిన్నమని రిమోడ్‌ సెన్సిం్గ పరిశీలనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలివైపు ప్రాంతం అంతరిక్ష శిలలు ఢఋకొట్టడం వల్ల ఏర్పడిన బిలాలతో నిడిపోయింది. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో భిన్న రీతుల్లో ఉన్నట్లు నిర్ధారణ అయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version