Aaron Finch: బుమ్ర బౌలింగ్ లో ఆడటం కంటే రిటైర్ అవ్వడం బెస్ట్ : ఆరోన్ ఫించ్

బుమ్రా లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే బాల్ ని రెండు వైపులా స్వింగ్ చేయగలడు.ఇక చాలా మంది బ్యాట్స్ మెన్స్ బుమ్రా బౌలింగ్ లో ఆడేటప్పుడు డిఫెన్స్ ని ఆడుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : October 17, 2023 4:57 pm

Aaron Finch

Follow us on

Aaron Finch: ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో చాలా మంది ప్లేయర్లు వాళ్ల ప్రతిభ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఇండియన్ బ్యాట్స్ మెన్స్, బౌలర్ల అందరి పర్ఫామెన్స్ లు చూసిన ప్రపంచం లోని క్రికెట్ అభిమానులందరు మన ప్లేయర్లకి అభిమానులుగా మారిపోతున్నారు. అలాగే ప్రపంచ దేశాల సీనియర్ ప్లేయర్లు సైతం మన ప్లేయర్లను ప్రశంసిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక క్రికెట్ ఈవెంట్ లో పాల్గొన్న ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ అయిన ఆరోన్ ఫించ్ కూడా మన ఇండియన్ బౌలర్ అయిన జస్ప్రిత్ బుమ్రా పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.బుమ్రా బౌలింగ్ అనేది చాలా వైవిధ్యకరంగా ఉంటుందని ఆయనంటే తనకి చాలా ఇష్టం అంటూ చెప్తూనే, ఆయన గాయాల బారిన పడినప్పుడు తొందరగా కోలుకోవాలని కోరుకున్న వాళ్లలో నేను ఒక్కడిని అంటూ చెప్పాడు.

బుమ్రా లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే బాల్ ని రెండు వైపులా స్వింగ్ చేయగలడు.ఇక చాలా మంది బ్యాట్స్ మెన్స్ బుమ్రా బౌలింగ్ లో ఆడేటప్పుడు డిఫెన్స్ ని ఆడుతూ ఉంటారు. ఒకవేళ భారీ షాట్ల కోసం ప్రయత్నం చేసిన కూడా ఆ బ్యాట్స్ మెన్స్ ఇబ్బందుల్లో పడతాడు. అందువల్లే ప్రతి ఒక్క బ్యాట్స్ మెన్స్ కూడా బుమ్రా బౌలింగ్ ని డిఫెన్స్ చేస్తూ ఉంటాడు. ఆయన బౌలింగ్ లో ఏ మాత్రం కొద్దిగా నిర్లక్ష్యం వహించిన కూడా ఆ బ్యాట్స్ మెన్స్ చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.ఆయన బౌలింగ్ లో ఎక్కువ షాట్స్ కోసం ప్రయత్నించకుండా డిఫెన్స్ ని ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పాడు.ఇక అందులో భాగంగానే అక్కడున్న ఒక వ్యక్తి బుమ్రా బౌలింగ్ ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి అని అడిగిన ప్రశ్న కి ఫించ్ ఫన్నీగా నా లాగా రిటైర్ అవ్వాలి అని చెప్పాడు ఇక దాంతో ఫించ్ బుమ్ర బౌలింగ్ ని ఎదుర్కోవడం కంటే రిటైర్ మెంట్ అవ్వడమే బెస్ట్ అనే విధంగా సమాధానం చెప్పినట్టుగా ప్రస్తుతం ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంకా ఇప్పటికే బుమ్ర వరల్డ్ కప్ మ్యాచ్ లలో వికెట్లను తీస్తూ వరల్డ్ కప్ లో కూడా తనదైన సత్తా చాటుతూ ముందుకు వెళ్తున్నాడు. ఈసారి ఇండియాకి వరల్డ్ కప్ రప్పించడం లో బుమ్ర చాలా కీలకపాత్ర పోషించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇండియన్ టీమ్ చాలా అత్యున్నతమైన విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఆరోన్ పించ్ చెప్పినట్టుగా బుమ్ర వేసిన స్లో కటర్ వల్లే మొన్న పాకిస్థాన్ మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వన్ ఆఫ్ స్టంప్ బేల్ ఎగిరిపోయింది. బుమ్ర బాల్ ని రెండు వైపులా కూడా స్వింగ్ చేయగలడు.ఈ క్రమంలోనే ఇండియన్ టీంకి దొరికిన మరొక అరుదైన ఆణిముత్యం అంటూ బుమ్రాని చాలామంది ప్లేయర్లు సైతం కొనీయాడుతున్నారు…