https://oktelugu.com/

Tiger 3 Trailer: 300 కోట్ల సల్మాన్ సినిమాలో 30 సెకన్ల కత్రినా టవల్ ఫైట్ హైలెట్.. ఇదేం ఖర్మరా బాబూ

కత్రినా కైఫ్ కేవలం టవల్ తో మాత్రమే ఉంది. అంటే ఇదేదో రొమాంటిక్ సీన్ అనుకోకండి. ఇదొక ఫైట్ సీన్. బాత్ టవల్స్ ధరించిన కత్రినా మరో లేడీ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తుంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 17, 2023 / 04:49 PM IST

    Tiger 3 Trailer

    Follow us on

    Tiger 3 Trailer: టైగర్ జిందా హై సినిమాతో మంచి టాక్ ను అందుకున్న కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదేనండి టైగర్ 3 సినిమాతో అలరించడానికి సిద్దమయ్యాడు ఈ బాలీవుడ్ హీరో. సల్మాన్ కు ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే సల్లూ భాయ్ సినిమా వస్తుందంటే అందరి ఎదురుచూపులు, నిరీక్షణ మరో లెవల్ లో ఉంటాయి. దీంతో అందరి ఆశలు ఇప్పుడు టైగర్ 3 సినిమా పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. కేవలం ఐదు సెకన్ల పాటు ఉన్న ట్రైలర్ అందరి దృష్టిని ఆకట్టింది.

    కత్రినా కైఫ్ కేవలం టవల్ తో మాత్రమే ఉంది. అంటే ఇదేదో రొమాంటిక్ సీన్ అనుకోకండి. ఇదొక ఫైట్ సీన్. బాత్ టవల్స్ ధరించిన కత్రినా మరో లేడీ ఇద్దరు కలిసి ఫైట్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఒకరి టవల్ ను మరొకరు లాగడంతో ఇద్దరు కూడా తమ శరీరాన్ని టవల్ తో కవర్ చేసుకుంటారు. ఈ ట్రైలర్ మొత్తం బోల్డ్ గా కనిపిస్తుంది. దీంతో ఈ బోల్డ్ ఫైటింగ్ సీక్వెన్స్ సినిమాపై ఫుల్ హైప్ వచ్చేసింది యూత్ లో… ఈ సీన్ ఒక్కటి చాలు సినిమాపై ఇంట్రెస్ట్ ను పెంచడానికి అంటున్నారు యూత్. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది.

    ఇదిలా ఉంటే యష్ రాజ్ ఫిలిమ్స్ అంటే స్పై యూనివర్స్ గుర్తొస్తుంది. కానీ ఈ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా లైన్ కూడా ఒకే యాంగిల్ లో ఉంటుంది. అందుకే ఈ బ్యానర్ లో వచ్చే సినిమాలు చూసి చూసి నెటిజన్లకు బోర్ కొట్టేసిందట. దీంతో టైగర్ 3లో ఏదైనా కొత్త ధనం ఉందా అని ఆశించారు. కానీ ట్రైలర్ చూసిన కామన్ ఆడియన్స్ కు మాత్రం నిరాశే మిగిలింది. ఇదే సంవత్సరం వచ్చిన షారుఖ్ సినిమా పఠాన్ కు, టైగర్ 3 ట్రైలర్ కు చాలా పోలికలు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే పఠాన్ లో జాన్ అబ్రహం విలన్ గా నటిస్తే టైగర్ 3లో ఇమ్రాన్ హష్మీ అని సింపుల్ గా కామెంట్ చేస్తున్నారు. మరి సినిమా విడుదలైతే గానీ ఎలా ఉందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది సల్లూ భాయ్ సినిమా.. అంచనాలు నెక్ట్స్ లెవల్ లో ఉంటాయి. ఆ రేంజ్ లో సినిమా లేకుండా అభిమానులు హట్ అవుతారు. అందుకే సింపుల్ గా నార్మల్ స్టోరీలను సల్మాన్ ఖాన్ కూడా ఒప్పుకోరని అంటున్నారు ఆయన అభిమానులు.