https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: అనుకున్నది సాధించాడు… దట్ ఈజ్ శివన్న!

మీ స్కానింగ్ పూర్తయ్యాక మళ్ళీ ఇక్కడికి తీసుకుని రావడం జరుగుతుందని చెప్పాడు. శివాజీ బయట గార్డెన్ ఏరియా లో నిలబడి నేను వెళ్తున్న అని చెప్పాగానే అందరూ షాక్ అయ్యారు.

Written By:
  • Shiva
  • , Updated On : October 17, 2023 / 05:05 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఆరో వారం నయని పావని ఎలిమినేషన్ తో పెద్ద షాక్ లో ఉన్న హౌస్ మేట్స్ కి మరో షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. నయిని వెళ్ళిపోయినందుకు అందరూ చాలా బాధ పడ్డారు. ఎంతో స్ట్రాంగ్ గా ఉండే శివాజీ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు.ఇక ఎలిమినేషన్ ముగిసింది. బిగ్ బాస్ శివాజీ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచాడు. శివాజీ మీ చెయ్యి ఎలా ఉంది అని అడిగారు. నా చెయ్యి ఓ ఫిఫ్టీ పర్సెంట్ బానే ఉంది కానీ .. గేమ్ కి ఎంత సహకరిస్తుందో తెలియడం లేదు అని చెప్పాడు. శివాజీ స్కానింగ్ కోసం మిమ్మల్ని బయటుకు తీసుకుని వెళ్లడం జరుగుతుంది.

    మీ స్కానింగ్ పూర్తయ్యాక మళ్ళీ ఇక్కడికి తీసుకుని రావడం జరుగుతుందని చెప్పాడు. శివాజీ బయట గార్డెన్ ఏరియా లో నిలబడి నేను వెళ్తున్న అని చెప్పాగానే అందరూ షాక్ అయ్యారు. మీరు వెళ్లొద్దు అంటూ శివాజీని ఆపే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ ఇంకా యావర్ ఐతే అన్న వెళ్లొద్దు అంటూ ఏడ్చేశారు. నేను మళ్ళీ వస్తాను రా స్కానింగ్ కోసం వెళ్తున్న అని చెప్పి బయటికి వెళ్లారు శివాజీ.

    దీంతో ప్రశాంత్ ఏడుస్తుంటే అమర్ హగ్ చేసుకుని ఓదార్చాడు. తర్వాత కొద్దిసేపటికి శివాజీ హౌస్ లోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ కి ఒక సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. తనకి నచ్చిన వాళ్ళని లగ్జరీ రూమ్ లో ఉండటానికి డిప్యూటీస్ గా ఎంచుకోమన్నారు బిగ్ బాస్. యావర్ శివాజీ ఇంకా సందీప్ లను ఎంచుకున్నాడు.

    హౌస్ లోకి వచ్చినప్పట్నుంచి శివాజీ కాఫీ కోసం అడగని రోజు లేదు. బిగ్ బాస్ ని తిట్టని రోజు లేదు.ఈ సారి లగ్జరీ బడ్జెట్ లో శివాజీ కోసం కాఫీ పౌడర్ పంపించారు. ఇక శివాజీ దిల్ ఖుష్ అయిపోయాడు. తిట్టి, గోల చేసి ఎలాగైతే అనుకున్నది సాధించాడు శివాజీ.