Aakash Chopra
Aakash Chopra: ఈ వరుస ఓటములు టీమిండియా కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను ముగించాయి. దీంతో టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు పెరిగిపోయాయి. కీలకమైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, గిల్, రాహుల్, రవీంద్ర జడేజా వంటి వారు విఫలమయ్యారు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ తెరపైకి 10 పాయింట్లు విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఆటగాళ్లు మొత్తం రంజి క్రికెట్ ఆడుతున్నారు. దేశవాళి క్రికెట్ మ్యాచ్లలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. అయితే ఇక్కడ కూడా రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ముంబై జట్టు తరఫున రంజి ఆడుతున్న అతడు జమ్ము కాశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు పరుగులు మాత్రమే చేసి, నిరాశ జనకమైన స్థితిలో అవుట్ అయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరఫున రంజి ఆడుతున్నాడు. 30 నుంచి రైల్వేస్ జట్టుతో మొదలయ్యే రంజి మ్యాచ్లో అతడు ఆడుతున్నాడు. వాస్తవానికి అతను ఇటీవలనే బరిలోకి దిగాల్సి ఉండేది. అయితే మెడ నొప్పి కారణంగా రంగంలోకి దిగలేదు.
ఇప్పుడు గౌతమ్ గంభీర్ వంతు
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు పెరిగిపోయాయి. అతడు ఆటగాళ్లపై పెత్తనం చెలాయిస్తున్నాడని.. సరిగ్గా ఆడనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని.. అతడిని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపించాయి. ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ అతడికి చివరి టోర్నీ కావచ్చని ఊహాగానాలు కూడా మీడియాలో వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై ఎవరికివారు తమ తమ స్థాయిలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో సీనియర్ ఆటగాడు ఆకాశ చోప్రా కూడా చేరాడు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఎంతకాలం కొనసాగుతాడో అతడు చెప్పేశాడు..” వరుస టెస్టు సిరీస్ ఓటమిల తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను పక్కకు పెట్టాలని డిమాండ్లు వినిపించాయి. అవి సర్వసాధారణమే.. ఇప్పుడు ఏదో కొత్తగా గౌతమ్ గంభీర్ విషయంలో జరగడం లేదు. కాకపోతే బీసీసీఐ గౌతమ్ గంభీర్ కు మరికొన్ని అవకాశాలు ఇవ్వచ్చు. ఇంకా కొంత సమయం కూడా సర్దుబాటు చేయవచ్చు.. భారత జట్టు ఈ ఏడాది ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఆడే సమయం వరకు గౌతమ్ గంభీర్ కు అవకాశం ఉంటుంది. ఒకవేళ టీం ఇండియా గనుక ఆ సిరీస్ కోల్పోతే కచ్చితంగా గౌతమ్ గంభీర్ కు ఉద్వాసన కలుగుతుంది. బహుశా అదే అతడికి చివరి సిరీస్ అవుతుందని” ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.