Odi World Cup 2023: ఇవాళ్ల ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టీం ల మధ్య జరుగుతున్నా వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో విజయం ఏ జట్టు ని వరిస్తుంది అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది.ఇక ఈ మ్యాచ్ ఒక ఎత్తు అయితే వరల్డ్ కప్ లో జరిగే మిగితా మ్యాచ్ లు మరొక ఎత్తు ఇక్కడ ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఇక ఇలాంటి నేపధ్యంలో ప్రతి టీం కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అన్ని మ్యాచ్ లు గెలుస్తూ వస్తేనే సెమిస్ కి చేరుకునే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం చాలా టీములు చాలా ఇబ్బందులను ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇక అందుకే ఈ వరల్డ్ కప్ లో చాలా మంది ప్లేయర్లు మంచి ఇన్నింగ్స్ ఆడటానికి ట్రై చేస్తూన్నారు…
ఇక వరల్డ్ కప్ ల్లో ప్లేయర్లు ఎంత బాగా ఆడిన కూడా కొన్ని సెంటిమెంట్ల ప్రకారమే టీం కప్పు గెలుచుకోవడం అనేది జరుగుతుంది.అదేంటంటే ఏ టీం జర్సీ లు అయితే లైట్ బ్లూ కలర్ లో ఉంటాయో ఆ టీం లు మాత్రమే కప్పులు కొడుతున్నాయి. నిజానికి 2011 లో ఇండియా టీం ప్లేయర్స్ కూడా లైట్ బ్లూ కలర్ లో ఉండే జర్సీ ని వేసుకున్నారు. కాబట్టి ఇండియా అప్పుడు కప్పు కొట్టింది.దానికి తగ్గట్టు గానే 2019 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవాల్సింది, అయిన కూడా ఇంగ్లాండ్ గెలిచింది కాబట్టి లైట్ బ్లూ జర్సీ అనేది మంచి ని సూచిస్తున్న నేపధ్యం లో ఈసారి కూడా ఇంగ్లాండ్ అదే జర్సీ తో రంగంలోకి దిగింది.ఇంతకు ముందు వీళ్లది రెడ్ జర్సీ అయిన కూడా కావాలనే సెంటిమెంట్ తో వీళ్ళు ఈసారి వరల్డ్ కప్ లో లైట్ బ్లూ జర్సీ తో బరిలోకి దిగారు… ఇక ప్రస్తుతం ఇవాళ్ల ఆడుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ ప్లేయర్లు అందరుకూడా ఆ జర్సీ లోనే కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నిజానికి ఇంగ్లాండ్ టీం ఇలాంటి సెంటిమెంట్లని ఎక్కువ గా నమ్ముతుంది. కాబట్టే వాళ్ళు దీనిని ఎక్కువగా పాటిస్తున్నారు.ఇక లైట్ బ్లూ డ్రెస్ వేసుకున్న ఇంగ్లాండ్ కి ఈసారి కూడా వరల్డ్ కప్ వస్తుందేమో చూడాలి…
ఇక ఇప్పటికే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ టీం తో ఆడుతున్న మొదటి మ్యాచ్ లో గెలవాలని చాలా వరకు ప్రయత్నాలు చేస్తుంది.ఇక ఈసారి కూడా వరల్డ్ కప్ కొట్టి వరుసగా రెండు సార్లు వరల్డ్ కప్ కొట్టిన టీం గా చరిత్రలో నిలవాలని ఇంగ్లాండ్ టీం చూస్తుంది.మరి దానికి అనుగుణంగానే ఇంగ్లాండ్ వరుస మ్యాచ్ లు గెలుస్తూ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తుందా అనేది చూడాలి.అలాగే వాళ్ళు ఆడుతున్న ప్రతి మ్యాచ్ లో వాళ్ల టీం లో ఉన్న కీలక ప్లేయర్లు అయిన బెయిర్ స్ట్రో,జొస్ బట్లర్, బెన్ స్టాక్స్, సామ్ కరణ్, మొయిన్ అలీ లాంటి ప్లేయర్లు చాలా కీలకంగా మారనున్నారు.
ఇక ఇంగ్లాండ్ నమ్మిన్నటుగా బ్లూ జర్సీ తో కనక వాళ్ళు ఈసారి కూడా కప్పు కొడితే వచ్చే వరల్డ్ కప్ కి అన్ని టీం లు లైట్ బ్లూ కలర్ జర్సీ నే వాడుతాయి అనడం లో సందేహమే లేదు. అయితే ఈసారి మాత్రం వరల్డ్ కప్ లో పోటీ చాలా టఫ్ గా ఉంటుంది అని తెలుస్తుంది.చిన్న దేశాలు కూడా ఈసారి పెద్ద దేశాలకి గట్టి పోటీ ని ఇవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఇలాంటిదే ఇండియా లో మరో సెంటిమెంట్ కూడా నడుస్తుంది 2011 ఐపీఎల్ లో చెన్నై టైటిల్ గెలిచింది కాబట్టి అప్పుడు వరల్డ్ కప్ వచ్చింది మళ్లీ ఇప్పుడు కూడా ఐపీఎల్ లో చెన్నై కప్పు గెలిచింది కాబట్టి ,ఈసారి కూడా ఇండియా కి కప్పు రావడం పక్క అని కొంత మంది ఇండియన్ క్రికెట్ అభిమానులు చెప్పుకుంటూ ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు…