https://oktelugu.com/

Conspiracy against India : అమెరికా, చైనా నిధులతో భారత్ పై కుట్ర, అందులో CPM ప్రధాన పాత్ర?

నిధులు అటు అమెరికా నుంచి.. ఇటు చైనా నుంచి నిధులు వస్తున్నాయి. నిధులు ఒకే సంస్థ స్వీకరిస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2023 / 04:17 PM IST

    Conspiracy against India : మన దేశంలో మీడియా రంగంలో అంతర్జాతీయ కుట్ర జరుగుతుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. భారత్ మొత్తం ఒపినీయన్ ను కంట్రోల్ చేసేది మీడియా కాబట్టి.. ఈ మీడియాలో భారీ కుట్ర జరుగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు న్యూస్ క్లిక్ అనే మీడియా సంస్థపై దాడులు జరిపి దాని జర్నలిస్ట్ రవిని అరెస్ట్ చేశాక దీనిపై పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఇది న్యూయార్క్ టైమ్స్ ఇండియాలోని న్యూస్ క్లిక్ సంస్థలో చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ నిధులు వెచ్చించిందని.. అమెరికా నుంచి ఈ నిధులు మళ్లాయని సంచలన కథనం ప్రచురించింది.

    నెవెల్లి రాయిసింగ్ ద్వారా నిధులు భారత్ కు మళ్లాయని న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. దీంతో ఈడీ ఈ న్యూస్ క్లిక్ మీద దాడులు జరిపి ఆ న్యూస్ క్లిక్ నిర్వాహకుడైన రవిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే.. నిధులు అటు అమెరికా నుంచి.. ఇటు చైనా నుంచి నిధులు వస్తున్నాయి. నిధులు ఒకే సంస్థ స్వీకరిస్తోంది. ఆ సంస్థ కమ్యూనిస్టు భావజాలం ఉన్నది కావడం గమనార్హం.

    అమెరికా, చైనా నిధులతో భారత్ పై కుట్ర, అందులో CPM ప్రధాన పాత్ర? పై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.