Mahesh-Trivikram Movie: టాలీవుడ్ లో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ తిరుగులేని స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పొచ్చు..ఈయన సినిమాలు యావరేజ్ గా ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ హిట్స్ గా నిలుస్తున్నాయి..దానికి ఉదాహరణే ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమా..ఈ చిత్రం తర్వాత ఆయన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి..రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది..ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా టాలీవుడ్ నిర్మాతల సమ్మె కారణంగా వాయిదా వెయ్యాల్సి వచ్చింది..అయితే ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియా లో ఎదో ఒకటి ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ అని..ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి,ఫాహద్ ఫాజిల్ మరియు పృద్వి రాజ్ సుకుమారన్ వంటి వారిని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదిస్తునట్టు వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే..ఈ సినిమాలో విలన్ పాత్ర కి మలయాళం స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది..ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే ముందే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట..పృద్వి రాజ్ సుకుమారన్ మలయాళం లో టాప్ 5 స్టార్ హీరోస్ లో ఒకరు..ఈయనకి అక్కడ గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నదంటే కచ్చితంగా హీరో తో సరిసమానమైన పాత్రే అయ్యి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు..ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా,థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు..ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని నిర్మించిన సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాని కూడా నిర్మించబోతున్నాడు..అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు కి సోదరుడిగా మరో యువ హీరో కూడా నటించే అవకాశాలున్నాయి.
Also Read: Karthikeya 2 Collections: కార్తికేయ 2 మొదటి రోజు వసూళ్లు..ఇది ఎవ్వరు ఊహించని అరాచకం
ఇలా భారీ తారాగణం తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు..మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో మన అందరికి తెలిసిందే..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి..రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ కాకపోయినప్పటికీ కూడా టీవీ లో ప్రసారమైనప్పుడు ఈ రెండు సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి..ఇప్పుడు ఎలా అయినా ఇప్పుడు తియ్యబోయ్యే సినిమా తో ఈసారి బాక్స్ ఆఫీస్ పరంగా కూడా రీ సౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు త్రివిక్రమ్..మరి ఈ సినిమా ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరుకు ఆగాల్సిందే.
Also Read:Bigg Boss 6- Sudeepa: బిగ్ బాస్ 6 షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్న పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్
Recommended Videos