https://oktelugu.com/

IPL 2024: టాటా కంపెనీ అయితే ఏంటట.. ట్రోల్స్ కు అతీతం కాదుగా..

ఐపీఎల్ కప్ స్పాన్సర్ గా టాటా కంపెనీ వ్యవహరిస్తోంది. ఇందుకుగానూ బీసీసీఐ కి భారీగానే చెల్లించింది. వచ్చే రోజుల్లోనూ ఆ కంపెనీ ఐపీఎల్ కప్ స్పాన్సర్ గా ఉంటుందని తెలుస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 30, 2024 / 09:10 AM IST

    IPL 2024

    Follow us on

    IPL 2024: టాటా.. వందల ఏళ్ల భారతీయ కంపెనీ. గుండుసూది నుంచి ఉప్పు వరకు అన్ని రంగాలలో విస్తరించిన కంపెనీ. ఈ కంపెనీ వచ్చిన లాభాలతో సమాజ శ్రేయస్సుకు పాటుపడుతుంది కాబట్టి.. ఈ కంపెనీ పై భారతీయులకు ఒక గౌరవం ఉంటుంది. టాటా కంపెనీ చేపడుతున్న పనులు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి.. ఆ కంపెనీని సగటు భారతీయుడు గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, ఆ కంపెనీ ఉత్పత్తుల కొనుగోలులో ముందుంటాడు. అయితే ఇటీవల ఆ కంపెనీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

    ఐపీఎల్ కప్ స్పాన్సర్ గా టాటా కంపెనీ వ్యవహరిస్తోంది. ఇందుకుగానూ బీసీసీఐ కి భారీగానే చెల్లించింది. వచ్చే రోజుల్లోనూ ఆ కంపెనీ ఐపీఎల్ కప్ స్పాన్సర్ గా ఉంటుందని తెలుస్తోంది. గతంలో విదేశాలకు చెందిన కంపెనీలు స్పాన్సర్లుగా ఉండగా.. దౌత్యపరంగా వచ్చిన విభేదాల వల్ల.. ఆ కంపెనీలను కాదనుకుని బీసీసీఐ టాటా కంపెనీకి అవకాశం ఇచ్చింది.. ముందుగానే చెప్పినట్టు సమాజ శ్రేయస్సు విషయంలో టాటా కంపెనీ ముందుంటుంది. ఈ క్రమంలో ఒక ప్రకటన చేసింది.

    ఐపీఎల్ కప్ స్పాన్సర్ కు ముందే టాటా కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఐపీఎల్ సీజన్లో నమోదయ్యే డాట్ బాల్స్ కు రెట్టింపు లేదా అంతకుమించి మొక్కలు నాటుతామని వెల్లడించింది. ఈ ప్రకారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక పోస్ట్ ప్రకారం ఈ ఐపిఎల్ సీజన్లో 323 డాట్ బాల్స్ నమోదు అయ్యాయట. ఆ ప్రకారం టాటా కంపెనీ 1,61,500 మొక్కలు నాటుతుందట. టాటా గ్రూపులోని అన్ని కంపెనీలు ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు అవుతాయట. అయితే ఈ నిర్ణయాన్ని చాలామంది సమర్థించగా.. కొంతమంది మాత్రం వ్యతిరేకించారు..

    ” ఈ నిర్ణయం సమర్ధనీయం.. అద్భుతం..కానీ మాకు తెలియాల్సింది ఏంటంటే మొక్కలు ఎక్కడ నాటారు..? ఎప్పుడు నాటారు? ఇలాంటి ప్రకటనలు చెప్పడానికి బానే ఉంటాయి గాని.. చేతల్లో చేసి చూపించాలంటేనే చాలా కష్టమని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి దీనిపై టాటా కంపెనీ ఇంతవరకు ఎటువంటి స్పందనా తెలియజేయలేదు.. నిజంగా మొక్కలు నాటుతుందా? లేకుంటే పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాలంటే మరికొంత కాలం పడుతుందేమో.