4th Test England vs India: రాహుల్ వికెట్ సాధించారు. గిల్ ను వెనక్కి పంపించారు. ఇంకేముంది మిగతా ప్లేయర్లను త్వరగా అవుట్ చేసి విజయం సాధించాలని ఇంగ్లాండు ఆటగాళ్లు అనుకున్నారు. కానీ వారి ఆశలపై రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ నీళ్లు చల్లారు.. కొరకరాని కొయ్యల్లాగా మారిపోయి.. ఇంగ్లాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించారు. ఐదో వికెట్ కు ఎవరూ ఊహించని స్థాయిలో అజేయంగా డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని దూరం చేశారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లలో అసహనం పెరిగిపోయింది.. ఒక దశలో రవీంద్ర జడేజా సెంచరీ చేసి జోరు మీద ఉన్నాడు. మరో ఆటగాడు వాషింగ్టన్ సుందర్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు.
వాషింగ్టన్ సుందర్ ను మాత్రమే కాదు రవీంద్ర జడేజాను కూడా సెంచరీ చేయకుండా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అసలైన కుట్రకు తెరలేపారు.. వీరిద్దరూ సెంచరీలకు దగ్గరైన సమయంలో ఇంగ్లాండ్ సారథి స్టోక్స్ మ్యాచ్ డ్రా చేయడానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోరాడు. మిగతా ప్లేయర్లు కూడా జడేజా, వాషింగ్టన్ సుందర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. డకెట్, రూట్ వంటి ప్లేయర్లు రవీంద్ర జడేజాతో మాట్లాడారు. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇలా వ్యవహరించడం పట్ల క్రీడా విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..” నాలుగో టెస్ట్ చివర్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదు. సుందర్, జడేజా శతకాలకు దగ్గరయినప్పుడు.. స్టోక్స్ మ్యాచ్ డ్రా చేసుకునేందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోరడం క్రీడా స్ఫూర్తిని మంటగలిపేదే. మిగతా ప్లేయర్లు వారిపై ఒత్తిడి తీసుకురావడం అత్యంత దారుణం.. త్వరగా సెంచరీలు చేసేసి వెళ్లిపోండి అన్నట్టుగా బ్రూక్, రూట్ బౌలింగ్ చేయడం అత్యంత చండాలమని” క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: గెలుపు తనదని ఇంగ్లాండ్ అనుకుంది.. అదే మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పింది!
రవీంద్ర జడేజా సెంచరీ చేసిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ రవీంద్ర జడేజా తో మాట్లాడాడు. వారి సంభాషణ స్టంప్ లలో ఏర్పాటుచేసిన కెమెరాలలో రికార్డు అయింది. ” పరిస్థితులు చూస్తే నీకు ఏమనిపిస్తుంది.. మ్యాచ్ డ్రా అవుతుంది కదా.. అలాంటప్పుడు ఇంకా బ్యాటింగ్ చేయడం ఎందుకు.. సెంచరీల కోసం ఎదురు చూస్తున్నారా.. త్వరగా షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోతుంది కదా” అంటూ స్టోక్స్ వ్యాఖ్యానించినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. దానికి రవీంద్ర జడేజా నిరాకరించాడు. ఆ తర్వాత రూట్ బౌలింగ్లో సుందర్ హ్యాట్రిక్ ఫోర్లు సాధించాడు. బ్రూక్ బౌలింగ్లో దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేశాడు.. ఆ తర్వాత మ్యాచ్ డ్రా అయినట్టు ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లు మైదానం నుంచి వెళ్లిపోయారు. ఈ దశలో ఇండియా ప్లేయర్లకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపించలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకానొక దశలో మ్యాచ్ డ్రా గా ప్రకటించడానికి జడేజాతో స్టోక్స్ గొడవ పడినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి బలం చేకూర్చే విధంగా వీడియోలు కూడా కనిపిస్తున్నాయి.
Stokes: Oi Jaddu, let’s just shake hands, It’s a draw anyway… no point dragging this.
Jadeja: Go and bowl
Stokes: Come on, mate
Jadeja: No mate here. You’re not the umpire. Don’t show me your tired face
Just Look At Face Of Clown Stokes bro crying pic.twitter.com/fVJhKnlMOc
— Virat (@chiku_187) July 27, 2025