https://oktelugu.com/

IPL Auction 2025 : ఐపీఎల్ వేలంలో 13 సంవత్సరాల బాలుడు.. అతడిని ఎంతకు, ఏ జట్టు కొనుగోలు చేసిందంటే..

ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. 2025 సీజన్ లో కప్ సాధించాలని 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి.. అయితే ఈ వేలంలో 13 సంవత్సరాల బాలుడు తన పేరును నమోదు చేసుకున్నాడు. అంతేకాదు రికార్డు ధరకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 25, 2024 / 09:50 PM IST

    IPL Auction 20215

    Follow us on

    IPL Auction 20215 :  ఐపీఎల్ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లు సందడి చేస్తున్నారు. తమ ఆటతీరుతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్న ఆ ప్లేయర్లు భారీ ధరకు అమ్ముడుపోయి సరికొత్త రికార్డు సృష్టించారు. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించారు. ఆదివారం ప్రారంభమైన మెగా వేలంలో వారు దిగ్గజ జట్లకు అమ్ముడుపోగా.. సోమవారం కూడా అలాంటి పరిస్థితే రిపీట్ అయింది. అయితే ఇందులో 13 సంవత్సరాల బాలుడు వేలంలో నిలవడం.. రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోవడం సంచలనం కలిగించాయి. ఐపీఎల్ మెగా వేలంలో అతిపెద్ద వయస్కుడిగా వైభవ్ సూర్య వంశీ (13) నిలిచాడు. అయితే వేలంలో ఇతడిని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. 1.10 కోట్లు ఖర్చు చేసి అతడిని దక్కించుకుంది. శ్రీలంక ఫేస్ బౌలర్ ఈశాన్ మలింగను హైదరాబాద్ జట్టు 1.20 కోట్లకు కొనుగోలు చేసింది.

    సంచలన ఆటగాడు

    వైభవ్ సూర్యవంశికి 13 సంవత్సరాలు మాత్రమే.. అయితే అతని ఆట మాత్రం అద్భుతంగా ఉంటుంది.. బలమైన మణికట్టు షాట్లు కొట్టడంలో సూర్యవంశీ సిద్ధహస్తుడు. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో రాణిస్తున్న అతడు ఐపీఎల్ లో తన పేరు నమోదు చేసుకోవడం ఒక సంచలనం అయితే.. రాజస్థాన్ జట్టు 1.10 కోట్లకు కొనుగోలు చేయడం మరో సంచలనంగా మారింది. అయితే ఇతడు రైట్ హ్యాండర్ బ్యాటర్.. జట్టు అవసరాల దృష్ట్యా బౌలింగ్ కూడా చేయగలడు.. అయితే వచ్చే ఐపీఎల్ లో ఇతడికి మైదానంలో ఆడే అవకాశం ఇస్తారా.. ఒకవేళ అలాంటి అవకాశం కనుక ఇతడికి లభిస్తే ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త సంచలనం నమోదు అవుతుంది. దిగ్గజ ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశం ఐపీఎల్ ఆడటం అతడి జీవితంలో మధురానుభూతిగా మిగులుతుంది. ఫుట్ బాల్ లీగ్ లోనూ ఇలాంటి సన్నివేశాలే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇటీవల యూరో కప్ లో స్పెయిన్ జట్టు ఆటగాడు యామల్ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. అన్నట్టు అతని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులోనే అతడు ఫుట్ బాల్ లో సంచలన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. ఫుట్ బాల్ మాదిరిగానే ఐపిఎల్ లోనూ సూర్యవంశీని కొనుగోలు చేసి రాజస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. అయితే ఇతడు ఎలా ఆడతాడు? ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు? రాజస్థాన్ జట్టు ఇతడికి ఆ అవకాశం ఇస్తుందా? భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మలచుకుంటుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభిస్తుంది.