కుప్పకూలిన పంజాబ్.. చెన్నై ఈజీ గెలుపు

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ నిప్పులు చెరగడంతో పంజాబ్ కింగ్స్ కుప్పకూలింది. ఈ ఐపీఎల్ లోనే తక్కువ పరుగులకు ఆలౌట్ అయ్యింది. చెన్నైతో జరుగుతున్న టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ దీపర్ చాహర్ నిప్పులు చెరిగే బంతులు వేసి 4 వికెట్లు తీశాడు. 13 పరుగులే ఇచ్చి పంజాబ్ టాప్ ఆర్డర్ ను […]

Written By: NARESH, Updated On : April 16, 2021 10:42 pm
Follow us on

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ నిప్పులు చెరగడంతో పంజాబ్ కింగ్స్ కుప్పకూలింది. ఈ ఐపీఎల్ లోనే తక్కువ పరుగులకు ఆలౌట్ అయ్యింది. చెన్నైతో జరుగుతున్న టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

చెన్నై బౌలర్ దీపర్ చాహర్ నిప్పులు చెరిగే బంతులు వేసి 4 వికెట్లు తీశాడు. 13 పరుగులే ఇచ్చి పంజాబ్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. దీంతో 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఓపెనర్లుగా వచ్చిన కేఎల్ రాహుల్ , మయాంక్ అగర్వాల్ 0, క్రిస్ గేల్ 10 పరుగులే చేసి ఔట్ అయ్యారు. తర్వాత హుడా 10, పూరన్ 0కు ఔట్ కావడంతో పంజాయ్ కోలుకోకుండా అయ్యింది.

ఇక పంజాబ్ బ్యాట్స్ మెన్ షారుఖ్ ఖాన్ 47 పరుగులతో ఆదుకోవడంతో 20 ఓవర్లలో 106 పరుగులు చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై బ్యాట్స్ మెన్ నింపాదిగా ఆడుతూ విజయం దిశగా కదిలారు. డూప్లెసిస్, మొయిన్ ఆలీ ధాటిగా ఆడడంతో చెన్నై విజయం సాధించింది.