https://oktelugu.com/

విషాదం: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఈ మధ్య వరుసగా నటులు, దర్శకులు, సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా అసువులు బాసారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా మరో హాస్యనటుడు కన్నుమూయడం సినీ పరిశ్రమంలో విషాదం నింపింది. కరొనా వ్యాక్సిన్ తీసుకున్నప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కు నిన్న తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి ఎక్మో ద్వారా ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది […]

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2021 / 08:20 AM IST
    Follow us on

    సినీ పరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఈ మధ్య వరుసగా నటులు, దర్శకులు, సినీ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా అసువులు బాసారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే తాజాగా మరో హాస్యనటుడు కన్నుమూయడం సినీ పరిశ్రమంలో విషాదం నింపింది.

    కరొనా వ్యాక్సిన్ తీసుకున్నప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కు నిన్న తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి ఎక్మో ద్వారా ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కానీ అది ఫలించలేదు. ఈరోజు ఉదయం కన్నుమూశారు.

    తమిళ సినీ ఇండస్ట్రీలో వివేక్ టాప్ కమెడియన్ గా చాలా కాలంగా ఉన్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా పరిచయమే.

    అగ్రదర్శకుడు శంకర్ తీసే సినిమాల్లో ఖచ్చితంగా వివేక్ కు కీలక క్యారెక్టర్ ఉంటుంది. మాధవన్ తీసిన ‘రన్’ సినిమా ద్వారా బాగా పేరొచ్చింది. రజినీకాంత్ ‘శివాజీ’ లో ఆయన స్నేహితుడిగా కీలక పాత్రలో వివేక్ నటించారు.రెండు సినిమాల్లో హీరోగానూ చేశారు. ఈ మధ్య హీరోగా పోవడంతో అవకాశాలు తగ్గాయి.

    కొద్దిరోజుల క్రితం ధనుష్ హీరోగా వచ్చిన రఘువరన్ బీటెక్ లోనూ వివేక్ కనిపించారు. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్న వేళ హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అసువులు బాసారు.

    2009లో వివేక్ కు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి. తమిళనాట బెస్ట్ కమెడియన్ గా ఐదు సార్లు అవార్డు దక్కించుకున్నారు. తమిళనాట ప్రముఖ సేవా కార్యక్రమాల్లోనూ వివేక్ చురుకుగా పాల్గొంటారు. ప్లాస్టిక్ ఫ్రీ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.