Zodiac Signs: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఒక్కో గ్రహం ఒక్కో రాశిలో ఆరు నెలల పాటు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఒక్కోసారి రెండు గ్రహాలు కలిపి ఒకే రాశిలో ప్రయాణం చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో మిగతా రాశులపై ప్రభావం పడి అధికంగా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. మార్చి 29న శని రాహు గ్రహాలు మీన రాశిలోకి ప్రవేశించాయి. ఈ రెండు రాశుల కలయిక అరుదైన సమయంలో కలుగుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారికి పట్టలేని అదృష్టం పడుతుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. మరి అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
శని రాహు గ్రహాల కలయిక వలన వృషభ రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారికి ఇప్పటినుంచి ఊహించని అదృష్టం వరించనుంది. మీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు సమకూరుతాయి. అయితే పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు.
రెండు గ్రహాల కలయిక వలన తులా రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారికి ఇప్పటివరకు ఉన్న ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకూడదు. విదేశాలనుంచి శుభవార్తల వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీన రాశి వారికి ఇప్పటినుంచి దశ తిరగనుంది. ఈ రాశి వారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థుల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం వస్తుంది.
ధనస్సు రాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఇతరుల వద్ద ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. వ్యాపారులు తల్లిదండ్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి
శని రాహు కలయిక వలన పై నాలుగు రాశుల వారికి కలిసి రానుంది. అయితే మిగతా రాశిల వారు శని అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారిలో ఉన్న దోషాలు కొంతవరకు తగ్గుతాయి.