‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు గజకేసరి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాష్ట్రాల వారికి లాభాలు.. మరికొన్ని రాశుల వారికి కష్టాలు ఉండలు ఉన్నాయి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : మీ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు జరపాలి. మానసికంగా ఆందోళనగా ఉంటారు. స్నేహితులు సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఉద్యోగులకు కాస్త ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న అనారోగ్యం ఎదురైనా వెంటనే రైతులను సంప్రదించాలి. పెండింగ్లో ఉన్న కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . . మిధున రాశి వారికి ఈ రోజు కృష్ణ పరిస్థితిలో ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల కదలికలను జాగ్రత్తగా గమనించాలి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. పిల్లల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. అనుకోకుండా కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. దీంతో ఉన్నతాధికారుల నుంచి వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సివస్తే పెద్దల సలహా తీసుకోవాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. కార్యాలయాల్లో ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో వాదనకు దిగుతారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. తల్లిదండ్రుల సలహాతో పెట్టుబడులు పెడతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . విద్యార్థుల భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం చేయొద్దు. వ్యాపారాలు మంచి లాభాలను పొందుతారు. ఒత్తిడి నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతారు. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాల పట్ల ఇతరులను జోక్యం చేసుకోనివ్వదు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించుకోవాలి. ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే స్నేహితుల సహాయంతో వీటిని పరిష్కరించుకుంటారు. ఇతరులకు అప్పు ఇచ్చే ప్రయత్నాన్ని మానుకోవాలి. ఎందుకంటే ఇవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు సానుకూల వాతావరణ ఉంటుంది. అధికారుల నుంచి వేధింపులు తగ్గుతాయి. ప్రియమైన వారికోసం కీలక వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . . ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు పెండింగ్ పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : దీర్ఘకాలికంగా పెట్టుబడును పెడతారు. గతంలో ప్రారంభించిన పనుల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తాయి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువు కొనుగోలు వచ్చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూల వాతావరణ ఉంటుంది.