Zodiac Signs: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు మారినప్పుడల్లా మరికొన్ని గ్రహాలపై ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశులు వారికి మాత్రం విశేషాలు సంపద కలుగుతుంది.. గ్రహాలు అన్నిటిలో శుక్రుడు చాలా సంపదను ఇచ్చే గ్రహంగా పేర్కొంటారు. రాక్షసుల గురువు అయినా శుక్రుడు వృషభం, తులా రాశికి అధిపతి. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తికి సంపద ఉండడంతో పాటు.. తెలివిగల జీవితాన్ని కొనసాగిస్తాడు. మే 31 నుంచి శుక్రుడు మేషరాశిలోకి వెళ్ళనున్నాడు. జూన్ 29 వరకు ఈ రాశిలోనే చిక్కుడు కొనసాగిస్తాడు. అయితే శుక్రుడు మేషరాశిలోకి వెళ్లడం వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. వీటిలో మూడు అధిక ప్రభావం పడి ధనవంతులుగా మారే అవకాశం ఉంది. ఆ రాశులు ఏవో చూద్దాం..
సింహరాశికి శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో సంచరించనున్నాడు. ఈ రాశి వారు మే 31 నుంచి కొత్తగా ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఈ రాశి వారు నిరుద్యోగులు అయితే వీరికి కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలు చేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ధన లాభం వస్తుంది. ఇన్నాళ్లు కష్టాలతో ఉన్నవారు వాటి నుంచి బయటపడతారు. కొత్తగా ఆదాయ వనరులు సమకూరుతాయి.
తులా రాశి వారికి శుక్రుడు ఏడవ ఇంట్లో సంచరించాను నాడు. దీంతో ఈ రాశి వారికి సమాజంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఒత్తిడి తగ్గిపోతుంది. ఉద్యోగులు కొత్త ఆదాయం వనరులు పొందుతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు.
శుక్రుడు మేష రాశిలో ప్రయాణించడంతో సొంత రాశి వారికి అనుకూలమైన వాతావరణం కలగనుంది. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉండనున్నాడు. దీంతో వీరు ఏ పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. మిగిలిపోయిన ఆదాయం తలపురుతుంది. అప్పుల నుంచి బయటపడతారు. వారసత్వం వల్ల వచ్చే ఆస్తి గురించి శుభవార్తలు వింటారు. కొత్తగా పనులు ప్రారంభిస్తే వాటిని వెంటనే పోస్ట్ చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.
పై రాశుల వారితో పాటు మిగతా రాశులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో శుక్రుడు అనుకూలంగా లేకపోవడంతో ఇంట్లో సంతోషం కోల్పోతారు. కానీ శుక్రుడు మే 31 నుంచి మేషరాశిలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల దాదాపు అన్ని రాశులపై ప్రభావం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.