Night Bath: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో బయట పనులు చేసేవారు రోజంతా ఎండవేడికి తట్టుకోలేక పోతారు. ముఖ్యంగా ఫీల్డ్ వర్క్ చేసేవారు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఈ క్రమంలో చల్లదనం కోసం సాయంత్రం మరోసారి స్నానం చేస్తారు. అయితే ఉదయం ఉక్కపోతతో ఇబ్బంది పడ్డవారు సాయంత్రం స్నానం చేయడం వల్ల కూల్ అయిపోతారు. అయితే కొన్నిసార్లు రాత్రి సమయంలో స్నానం చేయడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా వేడి నీటితో స్నానం చేసేవారు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అసలు రాత్రి సమయంలో స్నానం చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
రాత్రి సమయంలో స్నానం చేసి నిద్రపోవడం వల్ల హాయిగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. అందుకే కొందరు ఉదయం తో పాటు సాయంత్రం కూడా స్నానం చేస్తూ ఉంటారు. అయితే రాత్రి తలస్నానం చేసేవారు జుట్టు ఆరకముందే పడుకోవడం వల్ల సైనస్ వచ్చే ప్రమాదం ఉంది. రాత్రిపూట తలస్నానం చేసిన వారు తల పూర్తిగా ఆరనివ్వాలి.
కొందరు రాత్రి సమయంలో వేడి నీటితో స్నానం చేయడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని అనుకుంటారు. కానీ రాత్రి సమయంలో వేడి నీటితో గుండె వేగంగా కొట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో నిద్రకు బంధం కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని ఉష్ణోగ్రత బయటకు వచ్చి మరింత వేడిగా మారుతుంది. అందువల్ల రాత్రి సమయంలో వేడి నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోవద్దు.
రాత్రి సమయంలో పడుకునే రెండు గంటలకు ముందు స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా రెండు గంటల ముందు స్నానం చేయడం వల్ల గుండె పనితీరు స్లో అవుతుంది. లేకుంటే గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఉష్ణోగ్రత బాగా భరించలేని వారు రాత్రి సమయంలో స్నానం చేయవచ్చు. కానీ ఏడు గంటల లోపు స్నానం చేసి 9 లేదా 10 గంటలకు నిద్రించే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా చెమట వచ్చేవారు స్నానం చేయడం మంచిదే. ఎందుకంటే పొద్దంతా చెమట వచ్చిన వారు రాత్రి అలాగే నిద్రపోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్నపిల్లలు ఉదయం సాయంత్రం రెండుసార్లు స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మధ్యాహ్నం మొత్తం వారు ఆటలు ఆడడం వల్ల అనేక క్రిములు లేదా బ్యాక్టీరియా చేతులపై ఉండిపోతుంది. అంతేకాకుండా దుస్తులపై కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల సాయంత్రం కూడా వారు స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.