Zodiac Signs: శని దేవుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఒకసారి శని పీడ పట్టిందంటే ఏడేళ్ల వరకు విడిచి పెట్టదని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తమ జీవితంలో అన్ని అడ్డంకులు.. నష్టాలు ఎదురైతే.. శని పట్టిందని అనుకుంటూ ఉంటారు. అందుకోసం పరిహారంగా శని దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం, శనివారం శని దేవుడికి ప్రత్యేక పూజలు తైలాభిషేకం చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని భక్తులు భావిస్తారు. అయితే కొందరికి జాతక చక్రం ప్రకారం.. ఎన్ని పూజలు చేసిన వారి కి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. మరికొందరి జాతకం ప్రకారం వారు ఎలాంటి పూజలు చేయకుండా శని దేవుడు వారిపై అనుగ్రహం చూపిస్తాడు. ముఖ్యంగా ఈ మూడు రాశులపై శని దేవుడు ఎప్పటికీ చెడు దృష్టి పెట్టడని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం..
శని దేవుడు సొంత రాశిగా కుంభరాశిని పిలుస్తారు. మిగతా గ్రహాల కంటే శని గ్రహం చాలా నెమ్మదిగా పయనిస్తూ ఉంటుంది. ఈ గ్రహం ఒక్కోరాజులో రెండున్నర ఏళ్ల పాటు పయనిస్తూ ఉంటుంది. ప్రస్తుతం శనిగ్రహం మీనరాశిలో ఉన్నాడు. అయితే శని దేవుడి సొంత రాశి కుంభరాశి. దీంతో కుంభ రాశిపై శని దేవుడి చెడు దృష్టి ఉండదని అంటారు. అంతేకాకుండా ఈ రాశి వారిపై అనుగ్రహం ఉండడంతో ఈ రాశి కలిగిన వారు గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. మీరు ఏ పని చేపట్టిన అవి త్వరగా పూర్తి అవుతాయి. జీవితంలో కష్టపడిన దానికి తగిన ఫలితాలు ఈ రాశి వారికి ఉంటాయి.
కుంభ రాశి తర్వాత శని దేవుడు తులా రాశిపై మంచి దృష్టితో ఉంటాడు. శని దేవుడి అనుగ్రహం వల్ల తులా రాశి వారు అన్ని రకాలుగా విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంతేకాకుండా జీవితంలో అనుకున్నది కచ్చితంగా సాధిస్తారు. శని దేవుడు ఎప్పుడు వీరి వెంట ఉండడంవల్ల వీరు తప్పులు చేస్తే వెంటనే శిక్షింపబడతారు. అంటే వీరితో శని దేవుడు ఎక్కువగా తప్పులు చేయకుండా సక్రమ దారిలో నడిచేలా చూస్తాడు. అంతేకాకుండా కుటుంబంతో ఈ రాశి వారు నిత్యం సంతోషంగా ఉండేలా చూస్తాడు.
వృషభ రాశిపై శని దేవుడు ఎప్పటికీ మంచి దృష్టితో కలిగి ఉంటాడు. ఈ రాశి వారు అనుకున్న ఫలితాలను సాధించడానికి వెన్నంటే ఉంటాడు. ఎప్పటికీ డబ్బు కొరత లేకుండా చూస్తాడు. ఇతరులకు సాయం చేసే గుణం ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించుకునేలా శని దేవుడు సహాయం చేస్తాడు. అలాగే సమాజంలో వీరికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. వీరి కుటుంబం సంతోషంగా ఉండడానికి సహాయపడతాడు. వీరు వ్యాపారాలు చేపడితే అందులో కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేసి అందరి చేత ప్రశంసలు పొందుతారు. మిగతా వారి కంటే ఈ రాశి వారు శని దేవుడి ప్రభావం వల్ల భిన్నంగా కనిపిస్తారు.