Zodiac Signs: జాతక చక్రం ప్రకారం కొన్ని గ్రహాలు రాశులు మారినప్పుడు మిగతా రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శని దేవుడు ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు మరో రాశిపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే ఇదే సమయంలో రాహు కేతువులు 18 నెలలకు ఒకసారి రాశులను మారుస్తూ ఉంటారు. ఈసారి 2025 మే 18 రాహు కేతువు కుంభరాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాశులపై ప్రభావం పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండి ధన లాభం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఆ ప్రభావం పడే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
రాహు కేతువులు తమ రాసిని మార్చుకోవడం వల్ల సింహరాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వారికి ఇప్పటినుంచి కష్టాలు తొలగినట్లే అనుకోవాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేయాలని అనుకునే వారికి కలిసి వస్తుంది. వ్యాపారం విస్తరణ జరుగుతుంది. ఉద్యోగుల ప్రశాంతంగా ఉంటారు. తోటి వారితో సంయమనం పాటిస్తారు. ఎలాంటి చిక్కులు లేకుండా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు.
రాహు కేతువులు కుంభ రాశిలో ప్రవేశించడం వల్ల సొంత రాశిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ రాశి వ్యాపారులకు ఇప్పటినుంచి కలిసివచ్చే అవకాశం ఉంది. మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టిన లాభాలు అధికంగా వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఏదైనా పని మొదలుపెట్టిన వెంటనే దానిని పూర్తి చేస్తారు. కొత్తగా ఉద్యోగం చేరాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా మాటలను అదుపులో ఉంచుకోవాలి.
వృషభ రాశిపై కూడా రాహు కేతువుల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం వచ్చిన దానిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు.
మేష రాశి వారు మే 18 నుంచి కష్టాల నుంచి బయటపడతారు. వీరు ఎప్పటినుంచో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. అయితే తల్లిదండ్రులు వీరి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు ఉండాలి. జీవిత భాగస్వామి కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.