Women Smoker: ధూమపానం మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఇది తరుచుగా వినే మాట. సినిమాలకు ముందు, సినిమాల తర్వాత, యాడ్స్ మధ్యలో కనిపిస్తుంటుంది. ఇక గోడల మీద కూడా రాసే ఉంటుంది. అయితే ఈ ధూమపానం చేయడం మగవారి కన్నా ఆడవారికే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేయడం వలన అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాoతక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందట. ముఖ్యంగా చాలా సందర్బాలలో మహిళకు ధూమపానం చాలా హానికరం అంటున్నారు నిపుణులు.
మహిళకు ఎక్కువ హానికరం ఎందుకు?
జీవసంబంధమైన, హార్మోన్లలు, జీవక్రియ వ్యత్యాసాల కారణంగా పురుషుల కంటే ఆడవాళ్లుకు ధూమపానం వల్ల ఎక్కువ హానికరం అని వైద్య నిపుణులు సమాచారం. ధూమపానం వల్ల పురుషులకు, మహిళలకు ఇద్దరికీ ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, క్రనిక్ అబ్స్ట్త్ క్టివ్ పల్మనారీ డిసీజ్ (copd), గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. పురుషుల కంటే ఆడవారు తక్కువ పొగాకు వాడినప్పటికీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. స్త్రీల శరీర అంతర్గత అవయవాలు అంటే ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, మొదలగు సున్నిత ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
అందువలన పురుషుల కంటే తక్కువ సిగరెట్లు కాల్చిన, పొగాకు తిన్న వారిపై వీటి ప్రభావం ఎక్కువ ఉండి అనేక ప్రమాదకరమైన వ్యాధులను కలుగజేస్తుంది. వీటితో పాటు శ్వాసకోస సమస్యలు, వచ్చే అవకాశం ఎక్కువ. ధూమపానం చేసే మహిళకు పునరుత్పత్తి సమస్యలు, గర్భధారణ సమస్యలు, ఇంకా అకాల రుతువిరతి తో బాధపడే అవకాశాలు కూడా ఎక్కువ.
ధూమపానం మహిళకు మరింత హానికరం :-
ధూమపానం చేసే స్త్రీలు, ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు, గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. ఎందుకంటే ధూమపానం రక్త నాళాలను ఇరుకుగా చేసి రక్తం గడ్డకట్టే ధోరణిని పెంచుతుంది. దీనితో పాటు, హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా నికోటిన్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా మహిళల్లో నికోటిన్ వ్యసనం బలంగా మారి దానిని విడిచి పెట్టడం వారికి మరింత కష్టమవుతుంది. అంతేకాదు పొగాకులో ఉండే రసాయనాలు చర్మం కొల్లాజెన్‌ను కూడా దెబ్బతీస్తాయి. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది.
నిష్క్రియాత్మక ధూమపానం కూడా ప్రమాదకరం:-
ఈ నిష్క్రియాత్మక ధూమపానం వల్ల మహిళలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. దీనివల్ల తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం, నిర్జీవ జననం, శిశువుల్లో అభివృద్ధి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ పెరిగిన ప్రమాదాల దృష్ట్యా, మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధూమపానం మానేయాలి
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.