Mileage Cars: మిడిల్ క్లాస్ పీపుల్స్ సొంతంగా కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వీటిలో కారు కూడా ఉంటుంది. అయితే ఇలాంటివారు లో బడ్జెట్లో కారు కొనాలని చూస్తూ ఉంటారు. వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు తక్కువ ధరతో కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. లో బడ్జెట్ లో కారు కావాలని అనుకునేవారు మారుతి కంపెనీ వైపే ఎక్కువగా చూస్తారు. మారుతిలోని వ్యాగన్ఆర్ కారు కోసం ఎక్కువగా సెర్చ్ చేసేవారు ఉన్నారు. అయితే ఈ కారుకు గట్టి పోటీ చేస్తూ మార్కెట్లో పై చేయి సాధించింది టాటా టియాగో. తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటూ.. ఎక్కువ మైలేజ్ ఇస్తుండడంతో చాలామంది దీనికోసం ఎగబడుతున్నారు. అంతేకాకుండా గత ఏడాదిగా టాటా టియాగో కార్ల సేల్స్ పెరుగుతుండడంతో వినియోగదారులు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అసలు ఈ కారులో ఏముందంటే?
తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వీటి నిర్వహణ కూడా తక్కువగానే ఉండడంతో చాలామంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం మార్కెట్లో టాటా టియాగోకు మంచి గుర్తింపు ఉంది.. 2016లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పటివరకు అమ్మకాల్లో తీసుకుపోతుంది. 2025 మార్చిలో దీనిని 7,946 మంది కొనుగోలు చేశారు. అలాగే గత ఏడాదిలో ఈ మోడల్ 6,381 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు అమ్మకాలు 25 శాతం వృద్ధి సాధించినట్లు తెలుస్తోంది. అయితే టియాగో లో ఉన్న ఫీచర్స్ తో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో దీనికోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా మైలేజ్ లో ఇది మారుతి కార్ల కంటే ముందు ఉండడంతో దీనికోసం ఇగబడుతున్నారు. పెట్రోల్ తో పాటు సిఎన్జి, ఎలక్ట్రిక్ వేరియంట్ లో ఉన్న ఈ కారుICE ఇంజన్ ధర విషయానికి వస్తే లక్షలు గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ లక్షలతో విక్రయిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాలను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. ఈ మోడల్స్ సిఎన్జి మైలేజ్ కిలో ఇంధనానికి 28.60 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. టాటా టియాగో ఎలక్ట్రిక్ క్ కారుకు కూడా ఆదరణ పెరుగుతుంది. ఈ కారు ప్రారంభ ధర లక్షల ప్రారంభ ధర నుంచి లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో 24 కిలో వాట్ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 315 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు.
వాచ్ బ్యాక్ కారు కొనాలని అనుకునేవారు.. ఇది బెస్ట్ ఆప్షన్ అని ఆటోమొబైల్ రంగ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కొత్తగా కారు కొనాలనుకునే వారికి ఇది కన్వీనెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు.. చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారుగా నిలుస్తుంది అని చెబుతున్నారు. అయితే పెట్రోల్ ఇంధనానికంటే ఎలక్ట్రిక్ కారుకు ఎక్కువగా డిమాండ్ పెరిగిపోతుంది. కానీ దీని మెయింటెనెన్స్ లో అదనపు ఖర్చులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.