https://oktelugu.com/

Nagula Chavithi Wishes 2024 : ‘నాగుల చవితి’ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

జాతక దోషం ఉన్న వారు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ప్రధానంగా మహిళలు ఉదయాన్నే లేచి పాలు తీసుకొని పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే నాగుల చవితి రోజు ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఎలాగో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివారాల్లోకి వెళ్లండి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 / 11:27 AM IST

    Nagula Chavithi Wishes 2024

    Follow us on

    Nagula Chavithi Wishes 2024 : పండుగల సీజన్లో భాగంగా దీపావళి తరువాత వచ్చే కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది. ప్రతీ ఏడాది నాగుల పంచమితో పాటు నాగుల తుర్థిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా నాగదేవతకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.సమీపంలోని నాగమ్మ ఆలయానికి వెళ్లి విగ్రహాలకు పాలాభిషేకం చేస్తారు. అలాగే దగ్గర్లోని పుట్ట వద్దకు వెళ్లి పుట్టులో పాలు పోసి పూలు, పండ్లు ఉంచుతారు. జాతక దోషం ఉన్న వారు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తూ ఉంటారు. ప్రధానంగా మహిళలు ఉదయాన్నే లేచి పాలు తీసుకొని పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే నాగుల చవితి రోజు ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఎలాగో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివారాల్లోకి వెళ్లండి.

    2024 ఏడాదిలో నవంబర్ 5వ తేదీన నాగుల చవితిని జరుపుకుంటారు. పాములు, మనుషుల మధ్య భయాన్ని పొగోట్టడానికి పూర్వీకులు పాములను పూజించేవారు. క్రమంగా ఈ పండుగలు కొనసాగుతూ వస్తున్నాయి. పాములకు పాలు పోయడం వల్ల జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మరోవైపు రైతులకు పాములు ఎంతో మేలు చేస్తాయి. పంట పొలాల్లో ఎలుకలు లేకుండా పాములు తోడ్పడుతాయి. యోగ శాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఎన్నో దోషాలు ఉంటాయి. వీటిలో కామ, ్రోధ, లోభ, మధ వంటివి ప్రధానమైనవి ఈ లక్షణాలతో కొంతమంది అనుకోకుండా తప్పులు చేస్తారు. వీటిని సరిదిద్దుకోవడానికి నాగుల చవితి రోజు పాములకు ప్రత్యేక పూజలు చేయాలని అంటున్నారు.

    అయితే నాగుల చవితి రోజు ఇతరులకు శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఎలా చెప్పాలి? అనికొంతమందికి సందేహం ఉంటుంది. అదెలాగంటే?

    నాగుల చవితి సందర్భంగా.. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    శివుడి అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    ఈ నాగుల చవితి రోజున మీకు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    ఆ శివ శంకరుడి మహిమ వల్ల మీకు శుభం కలగాలి.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    నాగేంద్రుడు మిమ్మల్ని, మీ కుటుం సభ్యులను ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    జీవితంలో చెడును పోరాడే శక్తి ఆ నాగేంద్రుడు మీకు సమర్పించాలని కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ మీకుండాలని కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    ఈ నాగుల చవితి రోజు నుంచి మీ జీవితం ఆనందమయం కావాలి.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    పాములను పూజించడం ద్వారా ఆ శివుడి అనుగ్రహం మీకు కలగాలి.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    కోరిన కోర్కెలు తీర్చాలని ఆ నాగదేవతను కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    నాగదేవుడి దమ మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ.. నాగుల చవితి శుభాకాంక్షలు..

    సర్వదేవతల ఆశీస్సులు మీకు కలగాలని.. నాగుల చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు..

    సర్పదేవతలంతా మీకు తోడు ఉండాలి..

    నాగుల చవితి ద్వారా మీ కుటుంబంలో శాంతి కలగాలని కోరుకుంటూ.. నాగుల చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు..