spot_img
Homeఆధ్యాత్మికంSrirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని రాస్తుంటారు. ఇలా ప్రతి కార్యానికి ముందు శ్రీ అని ఎందుకు ఉంటుంది? హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ అనే అక్షరానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

హిందూ ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం శ్రీ అంటే లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాగే శ్రీ అంటే ఐశ్వర్యం, సంపద, శుభం, మంగళం, కీర్తి అనే అర్థాలు కూడా వస్తాయి. అందుకే చాలా వరకు శుభకార్యాల్లో శ్రీ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు సతీమణి అని చెప్పేటప్పుడు లక్ష్మీదేవిని శ్రీదేవి గా పిలుస్తారు. అంటే ఆ దేవుని గౌరవంగా స్మరించుకోవడంతో పాటు శుభం కలగాలని.. ఐశ్వర్యం సిద్ధించాలని కోరుకుంటూ ఉంటారు.

ఏదైనా కొత్త పనిని ప్రారంభించేముందు శ్రీకారం చుట్టడం అని అంటూ ఉంటారు. అంటే ఆ పని విజయవంతం కావడం కోసం దైవానుగ్రహం ఉండాలని కోరుకుంటుంటారు. శ్రీ అనే పదం రాయడం వల్ల ఆ పని కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం వారిలో కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి ప్రయత్నంలో దైవానుగ్రహం ఉండాలని శ్రీ ద్వారా దేవతలను ఆహ్వానించినట్లు అవుతుందని పేర్కొంటారు. శ్రీ అనే పదం ఆదిశక్తికి ప్రతిరూపం అని భావించి.. మంచి పనుల్లో ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత లేదా కుటుంబ సౌభాగ్యం ఉండాలని కోరుకునేవారు శ్రీ పేరు వచ్చేలా చూసుకుంటారు. శ్రీ పేరుతో నిత్యం పిలవడం వల్ల తమ ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉంటుందని భావిస్తారు.

అయితే శ్రీ అని రాయడం వల్ల డబ్బు వస్తుందని కొందరి భావన. కానీ కేవలం సంపద కోసం మాత్రమే శ్రీకారం కాదని.. ఒక మంచి ఆలోచనతో.. మంచి ఉద్దేశంతో పనిని ప్రారంభించి దానిని విజయవంతం చేయడం కోసం దైవానుగ్రహం కోరుకోవడం అని అంటున్నారు. అంటే ఒక పని విజయవంతం కావడానికి సానుకూలమైన వాతావరణాన్ని కలిగించాలని అనుకోవడమే దీని ఉద్దేశమని అంటున్నారు. నిత్యం శ్రీ శబ్దాన్ని వినిపించడం వల్ల అక్కడి వాతావరణం కూడా ప్రశాంతంగా మారుతుందని భావిస్తూ ఉంటారు.

శ్రీ అనే పదం ఉచ్ఛరించడం వల్ల వ్యాపార అభివృద్ధి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సమయంలో లేదా ప్రతి ఏడాది ఖాతాలను మార్చడంలో శ్రీ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు తమ వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుకుంటూ.. శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించడం కోసం ఇలా రాస్తూ ఉంటారు.

పెళ్లిళ్లలో శ్రీరస్తు అనే పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇద్దరూ వ్యక్తులు కలిసి జీవించడానికి చేసే మహా పుణ్యకార్యం విజయవంతం కావడంతో పాటు వారి జీవితాలు ఎప్పటికీ సంపద, సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శ్రీరస్తు అనే పదాన్ని రాస్తారు. పెళ్లి అనే కార్యక్రమంలో మొదటగా చేసేది శుభలేఖలు పంచడమే. అందుకే ఈ కార్యం ప్రారంభించేముందు శ్రీరస్తు అని రాసి మొదలుపెడతారు. అందువల్ల శ్రీరస్తు అనే పదానికి అంతటి ప్రాధాన్యత వచ్చింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper