Mahalaya Amavasya 2025: భాద్రపదం మాసం పూర్తయిన సందర్భంగా వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. సాధారణ అమావాస్య కంటే మహాలయ అమావాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. మహాలయ కృష్ణపక్షం లో పితృదేవతలను స్మరించుకుంటూ ఉంటారు. అయితే కొందరు మహాలయ అమావాస్య రోజున తర్పణం చేయాలని అనుకుంటారు. ఈ సందర్భంగా వారి పూర్వీకులకు మాంసాహారాలను వండి పెట్టాలని అనుకుంటారు. కానీ ఈరోజు మాంసాహారం తినవద్దని కొందరు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే?
మహాలయ అమావాస్య రోజు పూర్వీకుల కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తర్వాత వారికోసం ఆహార పదార్థాలు వండి పెడతారు. అయితే కొన్ని ప్రదేశాల్లో వారి పేరుతో మాంసాహారాలను వండుతారు. కానీ ఇలా మాంసాహారాలను వండడం వల్ల అశుభం జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుడిగా భావిస్తూ ఉంటాం. అలా దేవుళ్ళు అని భావించే వారికి మాంసాహారాలను పెట్టకూడదు. వారితో ఆధ్యాత్మిక సంబంధం ఉండాలని ఉద్దేశంతో సాత్విక ఆహారాన్ని మాత్రమే వండుకోవాలి. అంతేకాకుండా వారి పేరున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకుంటూ నదీ స్నానం చేయడం ఎంతో పుణ్యం. అంతేకాకుండా బ్రాహ్మణులకు దానధర్మాలు ఇవ్వాలి. ఈరోజు చీమలు, కాకులకు, ఆవులకు ఆహారం పెట్టడం వల్ల అవి పితృదేవతలకు వెళ్తాయని కొందరి నమ్మకం. అంతేకాకుండా వారి పేరిట అన్నదాన కార్యక్రమం నిర్వహించినా.. వారు ఎంత సంతోషిస్తారని చెబుతారు. కొన్ని పురాణాల ప్రకారం గతించిన పెద్దలు మహాలయ అమావాస్య రోజున తమ ఇంటి ముందు వచ్చి ఉంటారని.. తమ వంశం వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చూస్తారని చెబుతారు. ఇలాంటి సమయంలో తప్పుడు పనులు చేయకుండా.. మంచి పనులు మాత్రమే చేయాలి. వారికోసం కేవలం తర్పణం వదిలేసిన వారు ఎంతో సంతోషిస్తారు. ఈ తర్పణం నీరు రూపంలో లేదా ఆహార రూపంలో ఉన్న వారికి చెందుతుందని అంటారు.
చాలామంది రకరకాల రోజుల్లో మరణిస్తూ ఉంటారు. అయితే వారి తిథి తెలియని వారు మహాలయ అమావాస్య రోజున తరఫున ఇస్తూ ఉంటారు. ఇలా మహాలయ అమావాస్య రోజున తరఫున ఇవ్వడం వల్ల కేవలం తండ్రులు, వారి తండ్రులు, వారి వారి తండ్రులు కూడా సంతోషిస్తారని.. అందుకే ఈరోజు ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. అయితే ఈరోజు కేవలం సాత్విక ఆహారం ఇవ్వడం వల్ల తరతరాల వారు సంతోషిస్తారని.. మాంసాహారంతో వారు సంతృప్తి చెందారని అంటున్నారు.