Ratha Saptami : కనిపించని దేవుళ్లు కంటే కనిపించే సూర్య దేవుడుని చాలా మంది ఆరాధిస్తుంటారు. ఈ రోజుల్లో కంటే పూర్వ రోజుల్లో అయితే చాలా మంది ఉదయం పూట తప్పకుండా సూర్య దేవున్ని పూజిస్తారు. స్నానం ఆచరించి సూర్యునికి (Sun God) నీరు ఇచ్చి పూజలు చేస్తారు. ఇలా డైలీ చేయడం వల్ల కోరిన కోరికలు అన్ని కూడా తీరుతాయని భక్తుల నమ్మకం. అయితే కనిపించని అన్ని దేవుళ్లకు ఓ రోజు ఉన్నట్లు సూర్య భగవానుకి కూడా ఓ రోజు ఉంది. రథ సప్తమి (Ratha Saptami) రోజు చాలా మంది సూర్య దేవున్ని ఎంతో భక్తితో పూజిస్తారు. సూర్య దేవుడు మాఘ మాసం శుక్ల పక్షం ఏడవ రోజున జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సప్తమి తిథిలో జన్మించడం వల్ల ప్రతీ ఏడాది మాఘ మాసంలో ఈ తిథిలో రథసప్తమిని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది రథ సప్తమిని ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకుంటారు. ఈ తేదీన ఎందరో సూర్యుని భక్తితో పూజిస్తారు. రథ సప్తమి (Ratha Saptami) పూజించడం వల్ల కోరిన కోర్కెలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. రథ సప్తమి నాడు ఉదయాన్నే లేచి పూజలు నిర్వహిస్తే తప్పకుండా ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని పండితులు అంటున్నారు. ఈ సప్తమి నాడు సూర్య స్నానాలు చేయాలి. అంటే సమీపంలోని నది లేదా సముద్రంలో స్నానం చేసి సూర్యున్ని పూజించాలి. ఇలా భక్తితో సూర్యుడుని పూజించడం వల్ల జీవితంలోని సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. అయితే ఈ ఏడాది రథసప్తమిని ఏ సమయంలో ఖచ్చితంగా చేస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని సప్తమి తిథిలో సూర్య భగవానుని పూజించాలి. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 4:37 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి 05 తెల్లవారుజామున 02:30 గంటలకు ముగుస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీన రథ సప్తమిని జరుపుకుంటారు. అయితే ఫిబ్రవరి 4న ఉదయం 5.23 గంటల నుంచి 07.08 గంటల మధ్యలో స్నానం ఆచరించి సూర్య భగవానుని పూజించాలి. అప్పుడే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరడంతో పాటు అనుకున్న పనులు అన్ని ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. అయితే సూర్యుని భక్తితో ఒక నియమం ప్రకారం పూజించాలి. అప్పుడే పూజకి ఫలితం ఉంటుంది. రథసప్తమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా నది లేదా సముద్ర స్నానం చేయాలి. లేదంటే ఇంట్లోనే స్నానం ఆచరించాలి. పసుపు రంగు దుస్తులు ధరించి సూర్య దేవుడిని పూజించాలి. ముందుగా రాగితో అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత సూర్య దేవుని ఆరాధించి.. సూర్య మంత్రం, సూర్య చాలీసా పఠించాలి. ఆ తర్వాత సూర్యదేవునికి హారతి ఇస్తారు. దీంతో పాటు నీరు, వివిధ రకాలు అన్ని కూడా సూర్యునికి సమర్పిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సంతోషం, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే శారీరక, మానసిక బాధల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.