https://oktelugu.com/

Krishnashtami : కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి? కన్నయ్య ఆశీస్సులు అందాలంటే ఇలా చేయండి

శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు విష్ణు సహస్రనామం కూడా పారాయణం చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కృష్ణుడిని ఈరోజు 1008 తులసి దళాలతో పాటు నామాలను పటిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతుండాలి. ఉయ్యాలను ఊపుతూ.. కృష్ణుని నామస్మరణం చేయాలి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2024 / 10:32 AM IST

    Srikrishnashtam Special

    Follow us on

    Krishnashtami : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు కన్నయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కన్నయ్య పుట్టిన రోజు వేడుకలను ప్రతి ఏడాది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో బహుళ పక్ష అష్టమ తిథి రోజు రోహిణి నక్షత్రం నాడు శ్రీ కృష్ణాష్టమిని జరుపుకుంటారు. కన్నయ్య ఈరోజు జన్మించాడని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీమన్నారాయుణుడి అవతారాల్లో ముఖ్యమైనది శ్రీకృష్ణ అవతారం. ఇది చాలా ప్రత్యేకమైందని పండితులు చెబుతున్నారు. మరి ఈరోజు కృష్ణుడిని ఎలా పూజించాలి? ఎలాంటి పదార్థాలు పెట్టాలి? కృష్ణుడి ఆశీస్సులు అందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

    ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు.. కలియుగంలో మానవులకు లోకజ్ఞానాన్ని అందించారు. ధర్మం అంటే శ్రీకృష్ణుడు. అయితే లోకాన్ని నడిపించిన కృష్ణాష్టమి రోజు బాలుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడిని మాత్రమే పూజించాలని పండితులు అంటున్నారు. ఎందుకంటే జన్మాష్టమి అంటే బాలుడు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు. ఈరోజు భక్తి శ్రద్ధలతో కృష్ణుడిని పూజించాలి. చిన్ని కృష్ణుడి రూపంలో ఉన్న బాలకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అలాగే కృష్ణుడికి ఇష్టమైన పాలు, వెన్న వంటివి సమర్పించాలి. వీటితో పాటు పాలతో చేసిన పాయసం, అటుకుల పరవాన్నం కూడా బాలకృష్ణుడికి పెట్టాలి. అలాగే అష్టోత్తర శతనామావళితో పూజించి భాగవతం, మహా భారతం, భగవద్గీత పారాయణం చేస్తే కృష్ణుని అనుగ్రహం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.

    శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు విష్ణు సహస్రనామం కూడా పారాయణం చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కృష్ణుడిని ఈరోజు 1008 తులసి దళాలతో పాటు నామాలను పటిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతుండాలి. ఉయ్యాలను ఊపుతూ.. కృష్ణుని నామస్మరణం చేయాలి. అలాగే ఈ పూజ చేసేవాళ్లు బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాస సమయంలో కేవలం పండ్లు మాత్రమే తినాలి. ఉపవాసాన్ని తర్వాత రోజు ఉదయం వదలాలి. పగలు అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్ వంటివి వాటికి దూరంగా ఉండాలి.

    బాల కృష్ణుడికి నైవేద్యంగా ఇంట్లోనే ప్రసాదం తయారు చేసుకోవచ్చు. మఖ్ మిశ్రీ, కొత్తమీర పంజరి, శ్రీఖండ్ వంటివి చేసి పెట్టాలి. అలాగే జంతువులకు ఆహారం పెట్టాలి. ఎలాంటి హాని వాటికి కలిగించకూడదు. పూజ చేసేటప్పుడు కృష్ణుడికి ఇష్టమైన వాటిని సమర్పించాలి. నెమలి, ఈక, వేణువు, వెన్న వంటి వాటిని దేవుడికి ఇవ్వాలి. అలాగే ఇంట్లో ఉండే గోమాత విగ్రహానికి లేదా గోవులను పూజించవచ్చు. ఈరోజు ఏదో ఒక సమయంలో తప్పకుండా కృష్ణుడి ఆలయాన్ని సందర్శించండి. ఇలా దేవాలయాన్ని సందర్శించడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. పొద్దున్నే లేచి తలస్నానం చేసి భక్త శ్రద్ధలతో శ్రీ కృష్ణుడిని పూజిస్తే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని.. అలాగే మీ కోరికలు తీరుతాయని వేద పండితులు చెబుతున్నారు.