https://oktelugu.com/

Amy Jackson Marriage: హాలీవుడ్ నటుడిని పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చిన మన స్టార్ హీరోయిన్…ఫోటోలు వైరల్…

సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలనేవి అంత ఈజీగా రావు. ఒకవేళ వచ్చిన వాటిని నిలబెట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని.. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు పడితే తప్ప ఇక్కడ స్టార్లుగా ఎదిగే అవకాశాలు అయితే ఉండవు. కానీ కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పటికీ దాన్ని కన్సిస్టెంటుగా ముందుకు తీసుకెళ్లడం లో మాత్రం ఫేలవుతుంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 26, 2024 / 09:52 AM IST

    Amy Jackson Marriage

    Follow us on

    Amy Jackson Marriage: సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి హీరోయిన్ల కు మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది చాలా బాగా వర్తిస్తుంది. హీరోయిన్లు అందంతో అభినయంతో మంచి గుర్తింపును సంపాదించుకుంటే మరి కొంతమంది మాత్రం స్కిన్ షో చేసి ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పుకుంటారు. ఇక అలాంటి కోవకు చెందిన హీరోయినే అమీ జాక్సన్… రామ్ చరణ్ హీరోగా చేసిన ‘ఎవడు ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని లక్కీ హ్యాండ్ గా గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత విక్రమ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఐ ‘ సినిమాతో మరోసారి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని కెరియర్ లో టాప్ టాప్ పోనిషన్ కి వెళ్తుంది. ఇండస్ట్రీలో ఎవరికి దక్కని హోదా తనకి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని కారణాలవల్ల ఆమె సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. కారణం ఏదైనా కూడా ఆమె సినిమాల పైన పెద్దగా ఫోకస్ అయితే చేసినట్టుగా అనిపించలేదు. దానికి తోడుగా ఆమె కొంతమంది బిజినెస్ మెన్ లతో రిలేషన్ షిప్ లో ఉండడం సినిమాలను పట్టించుకోకపోవడం ఇలాంటివి చేయడంతో ప్రొడ్యూసర్స్ కూడా ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపించలేకపోయారు.

    ఇక ఆమె గత కొద్ది రోజుల నుంచి హాలీవుడ్ నటుడు అయినా ‘ఎడ్ వెస్ట్ వీక్’ తో ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.. ఇక రీసెంట్ గా వీళ్ళిద్దరి ప్రేమకి ఫుల్ స్టాప్ పెడుతూ పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని అమీ జాక్సన్ ఇన్ స్టా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. మొత్తానికైతే ఆమె తన ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెడుతూ పెళ్లి పీటలు ఎక్కడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది. ఇక ఇటలీలో వీళ్ళ పెళ్లి వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వహించారు…

    దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి…ఇక ఇదిలా ఉంటే అమీ జాక్సన్ గతం లో బిజినెస్ మెన్ ‘జార్జ్ పనియోటౌ’ తో డేటింగ్ చేసింది. అలాగే పెళ్లికి ముందే ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2020 లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకునే సమయానికి కరోనా రావడంతో కొద్ది రోజులపాటు పెళ్లి పోస్ట్ పోన్ చేశారు.

    ఇక ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో ఎవరికి వారు విడిపోయారు. ప్రస్తుతం అమీ జాక్సన్ కి పుట్టిన మగ బిడ్డ ఆమె తోనే ఉంటున్నాడు…ఇక గత కొన్ని రోజుల నుంచి అమీ జాక్సన్ ఏది చేసిన సంచలనంగా మారుతుంది. ఇక ఇలాంటి క్రమం లో మొత్తానికి అయితే ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడం తన అభిమానులను ఆనందానికి గురి చేస్తుంది…