Guru Purnima 2024: గురుపౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేయాలి? ఈరోజుకు ఎందుకంత ప్రాముఖ్యం?

హిందూ క్యాలెండర్ ప్రకారం.. సాధారణంగా గురు పౌర్ణమి ఆషాడ మాసంలో వస్తుంది. ఈ నెలలో వచ్చే శుక్లపక్షంలో ఉన్న పౌర్ణమినే గురు పౌర్ణమిగా భావిస్తారు. 2024 ఏడాదిలో గురుపౌర్ణమి జూలై 21న ఉండనుంది. అయితే జూలై 20 న సాయంత్రం 5.59 గంటలకు ప్రారంభమై జూలై 21 మధ్యాహ్నం 3.46 గంటలకు ముగుస్తుంది.జూలై 21న ఉదయం 5.37 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు మాత్రమే గురు పౌర్ణమిని నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.

Written By: Chai Muchhata, Updated On : July 19, 2024 1:41 pm

Guru Purnima 2024

Follow us on

Guru Purnima 2024: ఒక వ్యక్తి పరిపూర్ణుడు కావడానికి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో.. గురువుకూడా అంతే అవసరం. పురాణాల ప్రకారం వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించి భూమిపై ఉన్నవారందరికీ అందించాడు. మహాభారతం ద్వారా అపారమైన జ్ఞానాన్ని అందించాడు. అందువల్ల ఆ వ్యాస మహర్షిని అందరూ గురువుగా భావిస్తారు. ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. గురు పౌర్ణమి సందర్భంగా వేద వ్యాస మహర్షిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి ఎదుగుదలకు కారణమైన గురువులను ప్రత్యేకంగా పూజిస్తారు. పాఠశాలలు, కొన్ని కార్యాలయాల్లో గురు పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే గురుపౌర్ణమి ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈరోజు ఎలాంటి పనులు చేయాలి? అని కొందరిలో సందేహం ఉంది. ఆ సందేహాలు తీర్చేందుకు వివరాలు మీకోసం..

హిందూ క్యాలెండర్ ప్రకారం.. సాధారణంగా గురు పౌర్ణమి ఆషాడ మాసంలో వస్తుంది. ఈ నెలలో వచ్చే శుక్లపక్షంలో ఉన్న పౌర్ణమినే గురు పౌర్ణమిగా భావిస్తారు. 2024 ఏడాదిలో గురుపౌర్ణమి జూలై 21న ఉండనుంది. అయితే జూలై 20 న సాయంత్రం 5.59 గంటలకు ప్రారంభమై జూలై 21 మధ్యాహ్నం 3.46 గంటలకు ముగుస్తుంది.జూలై 21న ఉదయం 5.37 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు మాత్రమే గురు పౌర్ణమిని నిర్వహించుకోవాలని పండితులు చెబుతున్నారు.

గురు పౌర్ణమి రోజు ఏం చేయాలి? అని చాలా మందికి సందేహ ఉంటుంది. గురుపౌర్ణమిని పవిత్ర దినంగా పాటించాలి. ఉద్యం సూర్యోదనానికి ముందే స్నానమాచరించాలి. ఆ తరువాత తాము గురువులు అని భావించే వారిని ఇంటికి ఆహ్వానించాలి. ముందు వారి పాదాలకు నమస్కరించి మంచి నీటితో వాటిని శుభ్రం చేయాలి. వారికి అతిథి మర్యాదలు చేసి బహుమతులు ఇవ్వాలలి. ప్రతీ రంగంలో గొప్ప వ్యక్తులుగా మారడానికి వారి గురువే కారణమై ఉంటారు. అయితే గురు పౌర్ణమి రోజున వారిని తృప్తి పరచడం వల్ల వారి జీవితం బాగుంటుందని చెబుతారు.

గురు పౌర్ణమి రోజున గురువులకు ప్రత్యేక మర్యాదలు చేయడమే కాకుండా కొన్ని ఇతర పనులు కూడా చేయాలి. ఈరోజు పేద బ్రహ్మణుడికి పసుపు వస్త్రాలు, ఇత్తడి పాత్రలు, బెల్లం, నెయ్యి, పసుపు బియ్యం, మొదలైన వస్తువులను దానం చేయాలి. ఇలా చేస్తూనే గ్రహాల్లో గురువుగా ఉన్న బృహస్పతిని ఆరాధిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి జీవితంలో ఎన్నో సంతోషాలు పొందుతారని కొందరు పండితులు చెబుతున్నారు. ఇదే సమయంలో కొన్ని చిక్కుల నుంచి బయటపడుతారు.

ఈరోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలగనున్నాయి. గురు పౌర్ణమి రోజున చంద్రుడిని ఆరాధించాలి. అలాగే చంద్రుడికి అర్ఘ్యం ను సమర్పిచాలి. దీంతో జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొనేవారు గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మీ నారాయణుడి ఆలయంలో కొబ్బరికాయ సమర్పించడం వల్ల అనుకున్న ఫలితాలు నెరవేరుతాయిన కొందరి నమ్మకం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు పౌర్ణమి రోజున కొన్ి రాశఉల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు రవియోగం, ప్రతీయోగం ఏర్పడనున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొందరికి రాజయోగం కలగనుంది. మరికొన్ని రాశుల వారికి అనుకోని అదృష్టం వరించనుంది. అందువల్ల గురు పౌర్ణమి రోజు ప్రశాంత జీవితం గడుపుతూ ఆరాధ్య దేవతలను పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కొందరి భక్తుల నమ్మకం.