https://oktelugu.com/

Killing The Snake : పామును చంపడం వల్ల ఎలాంటి దోషం ఏర్పడుతుంది? పరిహారం కోసం ఏం చేయాలి?

పాము పగ జన్మజన్మలను వెంటాడుతుందని కొందరు చెబుతూ ఉంటారు. పాము దోషం ఉన్న వారి ఇంట్లో నిత్యం సమస్యలే ఉంటాయి. వారు ఏ పనిచేసినా ముందుకు సాగదు. ముఖ్యంగా వైవాహిక జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. సంతాన సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల విషయంలో బ్యాడ్ న్యూస్ వింటూ ఉంటారు. ఆర్థికంగా కుంగిపోతుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2024 / 10:35 AM IST

    Killing The Snake

    Follow us on

    Killing The Snake : పాములను చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే ఇది కాటు వేస్తే మరణం తథ్యం. అందువల్ల ఎక్కడ పాము కనిపించినా కొందరు దనిని చంపేస్తుంటారు. అయితే వాస్తవానికి అకారణంగా ఏ పాము మనుషులను కుట్టదని అంటారు. తనను తాను రక్షించుకునేందుకు ఆందోళన చెంది దగ్గరున్న వారిని కాటేస్తుందని చెబుతున్నారు. పాములు, మనుషులు ఎవరికి వారు తమ రక్షణ కోసం మాత్రమే దాడి చేస్తారు. అయితే కనిపిచిన ప్రతి పామును చంపాలని అనిపిస్తుంది. కానీ పాములను చంపడం వల్ల కొన్ని దోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఇవి ఏళ్ల తరబడి ఆ వ్యక్తికే కాకుండా కుటుంబానికి నష్టం తెస్తుంది. అకారణంగా పామును చంపినా, లేదా దాడి చేసినా పాములు పగబడుతూ ఉంటాయి. అయితే ఈ దోషం పోవాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవచ్చని కొందరు చెబుతున్నారు. అవేంటంటే?

    పాము పగ జన్మజన్మలను వెంటాడుతుందని కొందరు చెబుతూ ఉంటారు. పాము దోషం ఉన్న వారి ఇంట్లో నిత్యం సమస్యలే ఉంటాయి. వారు ఏ పనిచేసినా ముందుకు సాగదు. ముఖ్యంగా వైవాహిక జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. సంతాన సమస్యలు ఎదుర్కొంటారు. పిల్లల విషయంలో బ్యాడ్ న్యూస్ వింటూ ఉంటారు. ఆర్థికంగా కుంగిపోతుంటారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని కొందరు పరిహారం చేసుకుంటారు. కానీ కొందరు పట్టించుకోరు. కొందరికీ ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఇంట్లో మంచి జరగదు. కానీ పాములకు సంబంధించిన పరిహారం చేయడం వల్ల విముక్తి ఉంటుందని చెబుతున్నారు.

    పూర్వకాలంలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి పామును చంపడం వల్లే ఆ దోషం వెంటాడుతుందని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ పరిహారం పోవాలంటే పాముకు అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతున్నారు. సాధారణంగా నాగుపామును చంపినప్పుడు ఆ దోషం నుంచి విముక్తి చెందడానికి ఆ పాముకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అలాగే ఇతర పాములను చంపినా.. ఆ సమయంలో అంత్యక్రియలు నిర్వహించలేని వారు అందుకు సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెబుతున్నారు. అలా చేయడం వల్ల దోషం నుంచి విముక్తి కలుగుతుందని చెబుతున్నారు.

    అకారణంగా లేదా అనుకోకుండా పాములను చంపడం దోషమే అవుతుంది. అయితే ఈ విషయాన్ని ఎప్పటికైనా తెలుసుకొని ఆ విముక్తి కోసం సర్ప సంస్కార పూజలు చేయాలని చెబుతున్నారు. ఒక వ్యక్తికి నాగదోశం ఉంటే ఆ వ్యక్తికి వివాహ సమస్యలు ఎదుర్కొంటారు. సంతాన విషయంలో ఇబ్బందులు పడుతారు. అందువల్ల ఇటువంటి సమస్యలు ఉన్న వారు సర్పసంస్కార పూజలు చేయాలని అంటున్నారు. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్న వారు సైతం నాగదోశ పూజలు చేయడం వల్ల విముక్తి పొందుతారని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు.

    అయితే ఈ పూజలు నిర్వహించే సమయంలో భవిష్యత్ లో అలాంటి తప్పు చేయనని ప్రాయశ్చిత్తం చేసుకోవడం వల్ల ఈ దోషం నుంచి విముక్తి పొందుతారు. ఇలాంటి పూజలు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో నిర్వహిస్తూ ఉంటారు. ఒక వ్యక్తిచనిపోతే ఎలాంటి పద్ధతులు పాటిస్తారో.. అలాగే ఈ నాగదోషం పూజలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అవి వారి పూజలను బట్టి నిర్ణయిస్తారు.