Navratri Day 6 Goddess : కాత్యాయిని రూపంలో ఉన్న అమ్మవారిని పూజించే వారు ఎలాంటి దుస్తులు ధరించాలంటే?

ఆదిశక్తిగా పిలిచే అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి?

Written By: Srinivas, Updated On : October 8, 2024 1:04 pm

Katyayani

Follow us on

Navratri Day 6 Goddess  : అమ్మవారికి పూజలు.. దాండియా ఆటలతో దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 12 వరకు జరగనున్నాయి. ఊరూ వాడా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల్లో ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భవానీ దీక్షలు స్వీకరించిన స్వాములతో పాటు భక్తులతో మండపాలు సందడిగా మారనున్నాయి. సాయంత్రం దాండియా ఆటలతో పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఉల్లాసంగా గడుపుతున్నారు. నగరాలు, పట్టణాల్లో ఒక ప్రత్యేక ప్రదేశంలో నిర్వహిస్తున్న దాండియా సంబురాలు అలరిస్తున్నాయి. అయితే ఆదిశక్తిగా పిలిచే అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు? ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి?

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాలు, ఆలయాల్లో ఉన్న అమ్మవార్లకు ప్రతిరోజూ అలంకరణను చేస్తారు. అమ్మవారు 9 రూపాల్లో భాగంగా ఆరో రోజు కాత్యాయిని రూపంలో దర్శనమిస్తారు. కాత్యాయిని అమ్మవారు సింహంపై కూర్చుంటారు. అలాదే ఈరోజు నాలుగు లేదా పది లేదా పద్దెనిమిది చేతులతో దర్శనమిస్తారు. ఎడమ చేతిలో తామరపువ్వు , ఖడ్డాన్ని చేతబట్టుకొని ఉంటుంది. కుడి చేతితో భక్తులకు అభయం ఇస్తూ వరద ముద్రలో కూర్చుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కాత్యాయిని అమ్మవారు బృహస్పతిని పరిపాలిస్తుంది. అంతేకాకుండా ఈ దేవత తెలివిని, సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది.

మహిషాషురుడు అనే రాక్షసుడిని సంహరించానికి అమ్మవారు కాత్యాయిని రూపంలో కనిపిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఎప్పుడూ శాంతంగా కనిపించే అమ్మవారు ఈరోజు ఉగ్ర రూపంలో ఉంటారని చెబుతారు. అంతేకాకుండా పార్వతి మాతను కాత్య రుషి ఇంట్లో జన్మించిందని అందుకే కాత్యాయిని అవతారం ఎత్తుతారని అంటారు. దుష్ట సంహారానికే ఈ రూపంలో కనిపిస్తారని చెబుతున్నారు. అలాగే లోకంలో ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా..వాటిని తొలగించడానికి కాత్యాయినికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కాత్యాయిని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని అంటున్నారు. ముఖ్యంగా పెళ్లికాని యువతులు అమ్మవారి అనుగ్రహం పొందడం వల్ల వివాహ సమస్యల నుంచి బయటపడుతారని చెబుతున్నారు. అలాగే ఈరోజు రూపంలో ఉన్న అమ్మవారికి పూజించడం వల్ల కోరుకున్న భర్తను పొందుతారని చెబుతున్నారు. ఇందుకోసం ఉదయమే లేచి స్నానమాచరించి ఎరుపు రంగు దుస్తులను ధరించాలని అంటున్నారు. అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించాలని చెబుతున్నారు. చేతిలో తామరపువ్వులతో కనిపించే అమ్మవారికి తేనెను సమర్పించడం వల్ల ఆమె ఆశీర్వాదం పొందవచ్చని అంటున్నారు.

ఈరోజు ఎరుపును శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల తేజస్సు ఉంటుందని అంటుననారు. అలాగే అభిరుచి ప్రేమను కూడా పొందుతారని చెబుతున్నారు. అమ్మవారికి అత్యంత ఇష్టంగా ఉండే ఎరుపు దుస్తులను ధరించడం వల్ల అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. ఇన్ని రోజులు ఎలాంటి కష్టాలు ఉన్నా.. ఆర్థికంగా కుంగిపోయిన వారికి ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. అలాగే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నా తొలగిపోతాయని చెబుతున్నారు. ఈరోజు అమ్మవారికి నిష్టతో ఉపవాసం చేయడం వల్ల అన్నీ కలిసి వస్తాయి.