Fasting on Maha Shivaratri
Maha Shivaratri 2025 : హిందువులకు మహా శివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఇంతటి పవిత్రమైన పర్వదినం రోజున శివుడిని భక్తితో పూజించి, ఉపవాసం ఆచరిస్తే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే చాలా మందికి శివుడిని ఎలా పూజించాలి? ఉపవాసం ఎలా ఆచరించాలనే విషయం సరిగ్గా తెలియదు. దీనివల్ల వారు ఎంత భక్తితో పూజ చేసినా కూడా దానికి తగ్గ ప్రతిఫలం అందదు. కొందరు ఉపవాసం అని చెప్పి అన్ని రకాల పదార్థాలను తింటారు. మరికొందరు కనీసం పచ్చి మంచి నీళ్లు అయినా కూడా ముట్టుకోరు. అయితే పవిత్రమైన మహా శివరాత్రి నాడు ఏ విధంగా ఉపవాసం ఆచరిస్తే మంచి ఫలితాలు రావడంతో పాటు ప్రతిఫలం లభిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం.
మహా శివరాత్రికి శివుని పూజ చేయడం ఎంత ముఖ్యమో.. ఉపవాసం కూడా అంతే ముఖ్యం. మహా శివుడిని భక్తితో పూజించి ఉపవాసం ఆచరిస్తే తప్పకుండా కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. అయితే ఈ ఉపవాసాన్ని సరైన పద్ధతిలో చేయాలని పండితులు సూచిస్తున్నారు. అయితే శివుడిని భక్తితో పూజించి, రోజంతా శివనామస్మరణ చేయాలి. ఎలాంటి చెడు ఆలోచనలు మనస్సులో లేకుండా శివుడిని భక్తితో తలచుకోవాలి. అయితే కొందరు ఉపవాసం అనేది చాలా నిష్టతో చేస్తారు. కనీసం మంచి నీరు కూడా తీసుకోరు. కొందరు పండ్లు, జ్యూస్‌లు అవి తాగుతుంటారు. అయితే మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీరు ఉపవాసం ఉండవచ్చు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యపానం వంటివి తీసుకోకూడదు. రోజంతా ఉపవాసం ఆచరించి మరుసటి రోజు ఉదయం శివుడిని పూజించిన తర్వాతే ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని రకాల పదార్థాలను తినవచ్చు. పూరీలు, పిండి కుడుములు, పాల ఉత్పత్తులు, పండ్లు, జ్యూస్‌లు వంటివి తీసుకోవచ్చు. అన్నం కాకుండా ఏదైనా కూడా తినవచ్చని పండితులు చెబుతున్నారు. ఉపవాస సమయంలో గోధుమలు, పప్పులు, తృణ ధాన్యాలు, బియ్యం, ఉప్పు వంటివి అసలు తీసుకోకూడదు. కొందరు ఒక్కపూట భోజనం చేసి ఉపవాసం ఉంటారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లయితే ఇలా ఒక్కపూట భోజనం చేసి ఉపవాసం ఆచరించవచ్చు. అయితే కోరిక కోరికలు నెరవేరాలంటే మాత్రం ఏం తినకుండా భక్తితో శివ నామస్మరణ చేస్తే తప్పకుండా నెరవేరతాయి. ఎలాంటి బాధలు ఉన్నా కూడా తీరిపోతాయి. అయితే ఉపవాసం అనేది భక్తితో ఉండాలి కానీ కష్టంగా ఉండకూడదు. కొందరు కష్టం మీద ఉపవాసం ఆచరిస్తారు. ఇలా కాకుండా ఇష్టంతో ఉపవాసం ఆచరించడం వల్ల మీ కోరికలు నెరవేరతాయి. అయితే ఉపవాసం ఆచరించే వాళ్లు శివ రాత్రి రోజు ప్రదోష సమయంలో కూడా అభిషేకం చేయాలి. సాయంత్రం సమయంలో ప్రదోష కాలం ఉంటుంది. ఈ సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.