Rashi Phalalu: కొత్త ఏడాదిలో 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే?

మేషరాశికి సంబంధించి ఆర్థికంగా బలోపేతం అవుతుంది. సంతాన యోగం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

Written By: Chai Muchhata, Updated On : January 2, 2024 1:55 pm

Rashi Phalalu

Follow us on

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు ఉంటాయి. ఇందులో 8 నక్షత్ర పాదాలు ఉంటాయి. సూర్యుడు ఒక్కో రాశిలో మాస కాలం పాటు సంచరిస్తాడు. దీనినూ మాస సంక్రాంతి అంటారు. అయితే కొత్త సంవ్సరంలో సంక్రాంతి ఆగనమనం సందర్భంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. అయితే 2024 కొత్త ఏడాది సందర్భగా ద్వాదశ రాశుల్లో కొన్ని మార్పులు రానున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మేషరాశికి సంబంధించి ఆర్థికంగా బలోపేతం అవుతుంది. సంతాన యోగం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృషభ రాశిలోని కృత్తిక రాశుల వారు వ్యాపారులు అయితే వారికి అన్నింటా విజయాలు చేకూరుతాయి. అయితే జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. పుణ్యకార్యక్రమాల్లో కొంత ధనాన్ని వెచ్చిస్తారు. మిథునంలోని మృగశిర వారికి ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యాపార విషయంలో సొంత ఆలోచనలతోనే వెళ్లాలి. కర్కాటక రాశి వారికి శుభకార్యాలు వాయిదా పడుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి వారికి రెండు విధాలుగా ఫలితాలు ఉండనున్నాయి. సోదరులు, బంధువర్గం నుంచి సాయం అందుతుంది. శత్రువులు, కోర్టు వ్యవహాలు సులభంగా పరిష్కారం సాగుతాయి. అయితే ప్రయాణంలో జాగ్రత్తలు వహించాలి. కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. విద్యార్థులకు మరింత కష్టాలు ఎదురవుతాయి. రాజకీయ నాయకులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. తులా రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.వృశ్చిక రాశి వారి విషయంలో వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. ధనం విషయంలో మధ్య వర్తులు ఇబ్బందులు పెడుతారు.

ధనుస్సు రాశివారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో నిరాశ తప్పదు. మకర రాశివారికి శత్రు సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో సానుకూల వాతవరణం ఉంటుంది. వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి. కుంభరాశివారు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీనరాశివారికి ఆర్థిక చికాకులు తప్పుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.