Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకరాం అక్టోబర్ 20 శుక్రవారం 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
వ్యాపారాల్లో ప్రణాళికలు అవసరం. కొన్ని పనులునిలిచినా తిరిగి పుంజుకుంటాయి. ప్రయాణాల ద్వారా కొంత సమాచారం పొందుతారు. దైవభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభం:
కొన్ని విషయాల్లో సహనం అవసరం. తొందరపాటుతో చేసే పనులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు.
మిథునం:
ఈ రాశివారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఎవరిని నొప్పించకపోయినా మాటలు పడాల్సి వస్తుంది. దూకుడు స్వభావం తగ్గించుకుంటే మంచిది. కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోయేసరికి నిరాశ ఉంటుంది.
కర్కాటకం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొందరి దగ్గరి నుంచి ముఖ్యమైన సమాచారం పొందుతారు. నాయకత్వ లక్షణాలు పొందుతారు.
సింహం:
ఈ రాశివారికి ఈరోజు పనిభారం ఎక్కువే. అయితే ఏ సమస్య నుంచి అయినా సులభంగా బయటపడుతారు. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటారు.
కన్య:
ఈరోజు వీరికి శుభదినం. ఉల్లాసంగా గడుపుతారు. వ్యక్తిగతంగా పనితీరును మెరుగుపరుచుకుంటారు. అనుభవాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. బ్యాంకు లావాదేవీలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి.
తుల:
ఈరోజు ఆహ్లదకర వాతావరణంలో గడుపుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొన్ని ఒప్పందాలను కోల్పోవచ్చు.
వృశ్చికం:
కుటుంబ సమస్యలను మీరే పరిష్కరించుకోవాలి. ఇతరులను సంప్రదించొద్దు. జీవనశైలిలో మార్పులు వస్తాయి. మీ ఆకర్షణ చూసి ప్రజలు మెచ్చుకుంటారు.
ధనస్సు:
ఇతరుల నుంచి శుభవార్త వింటారు. కొన్ని పనులు బాధ్యతతో చేయాలి. రక్తసంబంధాలు బలపడుతాయి. ఇంట్లో ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుంది.
మకరం:
మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దగ్గరివారి కోసం చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. అవసరమైన పనిని త్వరగా పూర్తి చేయాలి.
కుంభం:
ఆర్థిక లక్ష్యాలపై ఫోకస్ పెడుతారు. ఆదాయం పెరుగుతుంది. పోటీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొన్ని విషయంలో ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు.
మీనం:
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తలపై జాగ్రత్తలు పాటించాలి. కార్యాలయాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ గురించి ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.