Vasant Panchami : హిందూ మతంలో తల్లి సరస్వతిని జ్ఞానం, కళ, సంగీతానికి దేవతగా భావిస్తుంటారు. అయితే స్కూల్‌లో చిన్నప్పుడు జాయిన్ చేసిన రోజు సరస్వతి దేవిని పూజిస్తారు. అలాగే వసంత పంచమి నాడు సరస్వతి పూజను నిర్వహిస్తారు. విద్యార్థులతో పాటు ప్రతీ ఒక్కరూ కూడా సరస్వతి దేవిని పూజిస్తారు. విద్య, వృత్తిలో విజయం సాధించాలని తల్లి సరస్వతి దేవిని పూజిస్తారు. చాలా మంది చిన్నపిల్లలకు ఈ వసంత పంచమి నాడు విద్యాభ్యాసం చేయిస్తారు. ముఖ్యంగా సరస్వతి ఆలయాల్లో పూజ చేయించి విద్యాభ్యాసం చేస్తారు. ఇలా చేయడం చదువులో ఉన్నతంగా రాణిస్తారని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 2న వసంత పంచమి జరుపుకుంటారు. ముఖ్యంగా ఉదయం 7.09 నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12.35 వరకు పూజ చేయాలి. ఈ సమయంలో చేస్తేనే విద్యార్థులు మంచిగా చదువులో రాణిస్తారని అంటున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి3న వసంత పంచమిని జరుపుకుంటున్నారు. సమీపంలో ఉన్న ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఒకవేళ ఆలయాలు లేకపోతే ఇంట్లోనే సరస్వతి పూజను చేసుకోవచ్చు. తల్లి సరస్వతి దేవిని పూజించడం వల్ల విద్య, మేధస్సు, సంగీతం, సృజనాత్మకత అన్ని కూడా లభిస్తాయని పండితులు అంటున్నారు. అయితే చదువులో రాణించాలంటే మాత్రం వసంతి పంచమి నాడు కొన్ని దుస్తులు ధరించి చేస్తేనే ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. మరి వసంత పంచమి నాడు ఎలాంటి దుస్తులు ధరించి పూజ చేయాలో చూద్దాం.
తల్లి సరస్వతి దేవికి తెల్లని వస్తువులు అంటే చాలా ఇష్టం. వసంతి పంచమి నాడు తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని పువ్వులతో పూజ చేసి పాలతో చేసిన నైవేద్యాలు సరస్వతి దేవికి సమర్పించాలి. ఇలా పూజ చేస్తే తప్పకుండా చదువులో రాణిస్తారు. అయితే ఈ పూజను కూడా ఆలస్యంగా కాకుండా తొందరగా భక్తితో చేయాలి. తెల్లవారు జామున లేచి.. స్నానం చేయాలి. పూజ చేసి స్థలంలో గంగా జలంతో మెత్తం క్లీన్ చేయాలి. ఒక క్లీన్ పోస్ట్‌పై పసుపు లేదా తెలుపు వస్త్రాన్ని పరిచి సరస్వతి విగ్రహం లేదా ఆ దేవి చిత్రాన్ని ప్రతిష్టించాలి. ఆ తర్వాత గణేశుడిని, నవగ్రహాలను పూజించాలి. తరువాత పంచోపచార పద్ధతిలో సరస్వతీ దేవిని పూజించి.. కుంకుమ, చందనం వంటి అష్ట గంధాలు పూయాలి. ఆ తర్వాత సరస్వతి తల్లికి పసుపు లేదా తెలుపు పువ్వులు సమర్పించాలి. పాలతో చేసిన నైవేద్యాలు సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూప ద్రవ్యాలు చూపించి సరస్వతీ మంత్రాలు పఠించాలి. అమ్మవారికి పాలతో చేసిన ఖీర్, కుంకుమ లడ్డూలు, రేగు పండ్లు వంటివి నైవేద్యాలుగా పెట్టాలి. తెలుపు లేదా పసుపు రంగులో ఉండే నైవేద్యాలను సమర్పించాలి. వీటన్నింటి తర్వాత సరస్వతి దేవీకి హారతి ఇవ్వాలి. ఇలా ఇంట్లో, స్కూల్, కాలేజీలో సరస్వతి పూజ చేస్తేనే ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.