vinayaka chavithi 2025 : ఊరు వాడ కొలువు తీరేందుకు గణనాథుడు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన మండపాల్లో గణేషుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు. అయితే గణనాథుడికి ఘనమైన పూజలు అందించేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే ముందు.. ఇంట్లో పూజ నిర్వహించే ముందు ఆ స్వామి గురించి.. పూజ నిబంధనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2025 ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవరాత్రులపాటు ఘనమైన పూజలు అందుకున్న తర్వాత విగ్నేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరుతారు. అయితే ఈసారి వినాయక నిమజ్జనం గురించి ఆసక్తి చర్చ జరుగుతుంది. అదేంటంటే?
వినాయక నిమజ్జనం ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా చేస్తారు. కొందరు ఒకరోజు ప్రతిష్టించి మరుసటి రోజు నిమజ్జనం చేస్తారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో 3,5,7,9,11 రోజులపాటు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ ఈసారి నిమజ్జనంకు గ్రహణ ప్రభావం ఉండనుంది. ఈసారి సెప్టెంబర్ 7న రాహు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే చంద్రగ్రహణం రాకముందే నిమజ్జనం చేసుకోవడం ఉత్తమమని పండితులు అంటున్నారు. అలాగే నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కొందరు సూచిస్తున్నారు. వినాయకుడిని పూజించే సమయంలో ఎంతో నిష్టతో ఉంటారో.. నిమజ్జనం చేసే సమయంలో కూడా అంతే భక్తితో ఉండాలని అంటున్నారు. ఇంట్లో ప్రతిష్టించిన విగ్రహాన్ని నదులు, చెరువులు దగ్గరికి వెళ్ళినప్పుడు లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడికి వెళ్లడానికి సాధ్యం కాకపోతే ఇంట్లోనే ఒక పాత్రలో వినాయకుడిని ఉంచి నిమజ్జనం చేయవచ్చు.
మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని చాలామంది పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే చాలామందిలో అవగాహన వచ్చి మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. కొందరు మట్టిని తీసుకువచ్చి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల ఓ పరమార్థం దాగి ఉంది. మట్టి నుంచి తయారైన వినాయకుడు ఎన్నో రకాల పూజలు అందుకుంటాడు. ఆ తర్వాత నిమజ్జనం సందర్భంగా యధాస్థితికి చేరుకుంటాడు. అంటే సృష్టిలో ప్రతిరూపం లో దేవుడు ఉంటాడని చెప్పడానికే ఇలా మట్టితో తయారుచేసిన విగ్రహాన్ని పూజించాలని చెబుతున్నారు.
వినాయకుడికి 21 పత్రాలతో పూజించడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా దేవుడికి సమర్పించే పక్షాల్లో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పత్రాలలో ఉన్న పోషకాలు నేరుగా మానవ శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో కొన్ని రకాల బ్యాక్టీరియాలనుంచి కాపాడుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలోనే వినాయక చవితి వస్తుంది. ఈ సమయంలో 21 పత్రాలతో పూజించడం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.