Travis Kelce – Taylor Swift Engagement: ప్రముఖ అమెరికన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్స్(Travis Kelce) చాలా కాలం నుండి టైలర్ స్విఫ్ట్(Taylor Swift) అనే అమెరికన్ పాప్ సింగర్ తో ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.హాట్ కపుల్ గా హాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఈ జంట ఆగష్టు 26 న నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా అనిపిస్తున్న ఈ జంట కి మా దిష్టి తగిలే లా ఉందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరికీ అమెరికా లోనే కాదు ఇండియా లో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో లక్షల సంఖ్యలో ఇండియన్స్ వీళ్ళను అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు పెళ్లి చేసుకోవడం పై వాళ్లంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఐపీఎల్ కు శాశ్వత వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్.. కారణమిదే?
టైలర్ స్విఫ్ట్ ‘ది క్రూయల్ సమ్మర్’ అనే పాట సెన్సేషన్ క్రియేట్ చేసి యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఇక అక్కడి నుండి ఈమె పాడిన ప్రతీ ప్రైవేట్ ఆల్బం అశేష ప్రేక్షాభిమానం సొంతం చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆమె 44 బ్లాక్ బస్టర్ పాటలని అందించింది. మన ఇండియన్స్ కూడా ఈమె పాఠాలను బాగా చూస్తారు. ఇక ఫుట్ బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్స్ ఎలాంటి ఆటగాడో మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈయన తన కెరీర్ లో మూడు సూపర్ బౌల్ ఛాంపియన్ షిప్స్ ని గెలిచాడు. వీటితో పాటు 4 ఫస్ట్ టీం ఆల్ ప్రో మ్యాచులు, 3 సెకండ్ టీం ఆల్ ప్రో మ్యాచులు కూడా గెలిచి తన సత్తా చాటాడు. ఇక ఈయన సారథ్యం NFL టీం 2010’s ఆల్ డికేడ్ టీం గా పేరు తెచ్చుకుంది. అదే విధంగా ఆల్ బిగ్ ఈస్ట్ టోర్నమెంట్ లో విజయవంతం సాధించిన మొట్టమొదటి టీం కూడా ఇతనిదే. ఇలా వేర్వేరు రంగాల్లో గొప్పగా రాణించిన వీళ్లిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుండడం హాట్ టాపిక్ గా మారింది.