Vinayaka Chavithi 2024: ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ఏడాది అయిన మంచిగా అన్ని పనులు జరగాలని కోరుకుంటూ గణపతిని పూజిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా వినాయకుని పూజిస్తారు. ఈ పండుగ కోసం అందరూ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తారు. కోరిన కోరికలు అన్ని నెరవేరాలని కోరుతూ.. బొజ్జ గణపయ్యని పూజిస్తారు. గణపతికి ఇష్టమైన వంటకాలు అయిన మోదకలు, పప్పు ఉండ్రాళ్లు, లడ్డు వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే గణపతికి ఇష్టమైన పువ్వులు, పత్రితో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇదిలా ఉండగా కొందరు గణపతిని పూజించిన తర్వాత గుంజీలు తీసి.. కోరికలు కోరుకుంటారు. ఇలా చేస్తే నెరవేరుతాయని నమ్ముతారు. అయితే గణపతికి ఇష్టమైన వాటిలో గుంజీలు ఒకటి. అసలు గణపతికి గుంజీలు అంటే ఎందుకు ఇష్టం? గణపతి దగ్గర గుంజీలు తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? గుంజీలు తీయకపోతే బొజ్జ గణపయ్య కోరికలు నెరవేర్చడా? పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.
గణపతికి ఇష్టమైన వాటిలో గుంజీలు ఒకటి. అయితే ఈ గుంజీలు తీయడానికి వెనుక ఓ స్టోరీ ఉంది. గణపతి శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అనే సంగతి తెలిసిందే. అయితే గణపతికి అందరూ ఎక్కువగా గిఫ్ట్ లు తీసుకు వచ్చేవారు. అలా విష్ణువు బహుమతులను గణపతికి చూపిస్తూ.. సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారు. అప్పుడు గణపతి ఆ చక్రాన్ని మింగేస్తాడు. విష్ణువు సుదర్శన చక్రాన్ని వెతకడం మొదలు పెట్టరు. అప్పుడు గణపతి మింగేసాను అని చెబుతాడు. దీంతో విష్ణువు ఆ చక్రం ఇవ్వమని గణపతిని ఎంత బ్రతిమలాడాడు. అయిన గణపతి ఇవ్వలేదట. ఏం చేయాలని టెన్షన్ తో విష్ణువు ఎడమ చేతితో కుడి చెవి, కుడి చేతితో ఎడమ చెవి పట్టుకుని గుంజీలు తీశారు. అప్పుడు వినాయకుడు ఒక్కసారిగా నవ్వాడు. దీంతో గణపతి బొజ్జలో ఉన్న ఆ సుదర్శన చక్రం ఒక్కసారిగా నోటి నుంచి బయటకు వచ్చింది. అలా కోరిన కోరికలు నెరవేరాలంటే.. గుంజీలు తీస్తే వినాయకుడు తీర్చేస్తాడని నమ్మకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ వినాయకుని దగ్గర గుంజీలు తీస్తారు. అందుకే వినాయకునికి గుంజీలు అంటే చాలా ఇష్టం. ఏ భక్తుడు వచ్చి గుంజీలు తీసి కోరిక కోరుకుంటే.. వినాయకుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే ఇలా గుంజీలు తీయడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట. గుంజీలు తీయడం వల్ల మెదడు బాగా పని చేస్తుందట. అందుకే చిన్న పిల్లలకి టీచర్లు ఎక్కువగా గుంజీలు తీయమంటారు. ఇలా చేయడం వల్ల పిల్లల బ్రెయిన్ బాగా పని చేస్తుంది. వాళ్లు చదువులో రాణిస్తారని నమ్ముతారు. మరి మీరు ఎప్పుడైనా గణపతి దగ్గర గుంజీలు తీసి కోరిక కోరుకున్నారా? నెరవేరిందా? కామెంట్ చేయండి.