భారతదేశం మిస్టరీస్ ఆలయాలకు నెలవు. ఇక్కడ అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సైంటిస్టులు పరిశోధన చేసినా కొన్ని విషయాలు అంతు చిక్కడం లేదు. దేశంలోని ఓ ఆలయంలో అమ్మవారి ఆలయంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుందని భక్తులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం పూజించే సమయానికి అమ్మవారి పాదాలను చూడగా దూళి ఉంటుందట. అంటే రాత్రిళ్లు అమ్మవారు తిరుగుతున్నారని అంటున్నారు. ఇంతకీ ఆలయం ఎక్కడుందో తెలుసా?
ఇండియాలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో పశ్చిమ బెంగాల్ లోని కాళికాదేశి ఆలయం ఒకటి. కలకత్తాలో ఉన్న కాళికా అమ్మవారి ఆలయంలో అనేక అద్భుతాలు చోటు చేసుకొన్నాయి. కొన్ని నమ్మలేని విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడున్న జాయ్ శ్యాంసుందరి కాళీ మందిర్ ఆలయంలో ప్రతిరోజూ రాత్రి సమయంలో చప్పుళ్లు వినిపిస్తున్నాయని భక్తులు, స్థానికులు చెబుతున్నారు. అయితే ఇది ముందుగా ఎవరూ నమ్మేలేదు. కానీ ఉదయం అమ్మవారి ఆలయం తలుపులు తెరవగానే అమ్మావారి పాదాలపై దూళి ఉంటుందట.
ఇదే కాకుండా ఈ ఆలయంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. ఈ ఆలయంలోకి వచ్చి ఎవరైనా తమ బాధలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మవారి ముహంలో మార్పులు వస్తాయట. పూజా సమయంలో అమ్మవారి కదలికలు ఉంటాయని పూజారులు చెబుతున్నారు.
ఈ ఆయలంలో అమ్మవారికి ముడి బియ్యం, అరటిపండ్లు కానుకగా ఇస్తారు. ఈ రెండు వస్తువులు ఇవ్వడానికి ఒక చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఒకసారి ఓ అమ్మాయి వచ్చి పూజారిని బియ్యం, అరటిపండ్లు అడిగితే నిరాకరించాడట. దీంతో మరుసటి రోజు ఆలయంలో విగ్రహం మాయమైందని అంటున్నారు. ఆ తరువాత మరుసటి రోజు అదే అమ్మాయి వచ్చి బియ్యం, అరటిపండ్లు అడగడం మొదలుపెట్టిందట. దీంతో అప్పటి నుంచి అమ్మవారికి ముడిబియ్యం, అరటిపండ్లు సమర్పిస్తున్నారు.