Hanuman Devotion: రామాయణంలో హనుమంతుడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సీత జాడ వెతకడంలో ఆంజనేయుడు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఆంజనేయస్వామి జాడతోనే శ్రీరాముడు సీత దగ్గరికి వెళ్తాడు. అలా చిరంజీవి గా మారిన ఆంజనేయస్వామిని నిత్యం భక్తులు కొలుస్తూ ఉంటారు. శంభాల నగరంలో ఆంజనేయస్వామి ఇప్పటికీ జీవించే ఉన్నాడని భక్తులు నమ్ముతారు. దీంతో ఆ స్వామిని ఊరూరా నిలుపుకొని నిత్యం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మంగళవారం, శనివారం నాడు విశేష పూజలు చేస్తూ స్వామిని కొలుస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో చాలామంది జైశ్రీరామ్ అంటూ ప్రదక్షణలు చేస్తారు. కానీ ఇలా కాకుండా మరో మంత్రంతో ప్రదక్షిణలు చేయడం వల్ల ఎంతో మంచిది అని కొందరు ఆధ్యాత్మిక వ్యాధులు చెబుతున్నారు. మరి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఆంజనేయస్వామి అనుగ్రహం ఉంటే అన్ని విజయాలే ఉంటాయని భక్తుల నమ్మకం. భయాందోళన పోగొట్టే ఈ మారుతి తనను నమ్మినవారికి వెన్నంటే ఉంటూ ఏ దుష్టశక్తి దగ్గరికి రాకుండా చేస్తాడు. అందుకే చాలామంది ఆంజనేయ స్వామికి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి మందారం పుష్పం, తమలపాకు వంటి వాటితో చేయడం వల్ల మరింత తొందరగా స్వామివారి అనుగ్రహం పొందవచ్చని చెబుతారు. ఇలా స్వామివారికి ఇష్టమైన వాటిని సమర్పించి ప్రదక్షిణలు చేయడం వల్ల సంతోషిస్తారని చెబుతారు.
Also Read: శ్రీకృష్ణదేవరాయలు, తానీషా, సర్వాయి పాపన్న.. తెలంగాణ బోనాల వెనుక పెద్ద చరిత్ర
అయితే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసే సమయంలో సాధారణంగా కాకుండా ఓ మంత్రం జపిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల స్వామి తొందరగా అనుగ్రహం ప్రసాదిస్తాడని కొందరు ఆధ్యాత్మిక వ్యాధులు అంటున్నారు. ఆ మంత్రం ఏంటంటే ‘ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం’.. ఈ మంత్రాన్ని జపిస్తూ ఆంజనేయ స్వామికి ప్రదక్షణలు చేస్తే తప్పకుండా అనుగ్రహం ప్రసాదిస్తాడని అంటున్నారు. అంతేకాకుండా ఈ మంత్రం గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు మాత్రమే వాడాలని అంటున్నారు.
ఇక సాధారణ సమయంలో ఏదైనా కష్టం వస్తే ఆంజనేయస్వామిని కొలవడం వల్ల వెన్న అంటే ఉంటారని భక్తులు నమ్ముతారు. దుష్టశక్తులను తరిమికొట్టే ఆంజనేయ స్వామికి వేసవికాలంలో ప్రత్యేకంగా దీక్షలు చేపట్టి భజనలు చేస్తారు. దాదాపు మండలం పాటు మాలలు వేసుకొని పూజలు చేస్తారు. మిగతా ఆలయాల కంటే గ్రామాల్లో ఆంజనేయ స్వామి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీ ఆలయాలను అభివృద్ధి చేస్తూ నిత్యం పూజలు చేస్తుంటారు. మనం ఎన్నో కార్యక్రమాలతో బిజీగా ఉన్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా.. ఆంజనేయస్వామి కొలిస్తే తప్పక కరుణిస్తాడని చెబుతారు.
జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా.. ఇబ్బందులకు గురవుతున్నా.. ఆంజనేయ స్వామికి 11 రోజులపాటు ప్రత్యేకంగా దీక్షలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం ఉంటుందని కొందరు పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా 11 వారాలపాటు నిష్ఠతో ఉపవాసం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చని పేర్కొంటున్నారు.