Vaikunta Ekadasi 2025: ప్రతి ఏడాదిలో 24 ఏకాదశిలు వస్తుంటాయి. ప్రతి ప్రతి ఏకాదశి రోజున ప్రత్యేకమైన కొందరు భావిస్తారు. అయితే వీటన్నింటిలో వైకుంఠ ఏకాదశి విశిష్టమైనది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తాడు. అయితే వైకుంఠ ఏకాదశి రోజునే మరో విశిష్టత కూడా ఉంది. ఇదే రోజున పుత్రదా ఏకాదశి కూడా రాబోతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున ప్రత్యేకంగా వ్రతం చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని కొందరి నమ్మకం. అంతేకాకుండా పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా.. మంచివారిగా ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా వ్రతం చేస్తారు. అసలు పుత్రదా ఏకాదశి వ్రతం ఎలా చేస్తారు?
హిందూ క్యాలెండర్ ప్రకారం పుత్రదా ఏకాదశి ప్రతి ఏడాదిలో రెండుసార్లు వస్తుంది. ఒకటి శ్రావణమాసంలో.. మరొకటి పుష్య మాసంలో.. పుష్యమాసం డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు ఉంటుంది. అంటే 2025 డిసెంబర్ 30వ తేదీన పుత్రదా ఏకాదశి రాబోతుంది. ఇదే రోజు వైకుంఠ ఏకాదశి ఉండడంతో ఈరోజును పర్వదినంగా భావిస్తున్నారు. అయితే సంతానం కోరుకునేవారు.. మంచి సంతానం ఆశించేవారు పుత్రదా ఏకాదశి వ్రతం చేయాలని అంటున్నారు. పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఒకవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుంటూ.. మరోవైపు పుత్రత ఏకాదశి వ్రతం కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు.
పుత్రదా ఏకాదశి డిసెంబర్ 30 ఉదయం 7.50 నుంచి మరుసటి రోజు ఉదయం 5.00 గంటల వరకు తిధి ఉండనుంది. అందువల్ల ఈ రోజునే పుత్రత ఏకాదశి వ్రతం చేయాలి. ఏకాదశి రోజున ఉపవాసం చేసేవారు ఆ రోజంతా కనీసం నీటిని కూడా తీసుకోరు. మరికొందరు పండ్లు, ఫలహారాలు మాత్రమే తీసుకుంటారు. ఇలా చేస్తే ఎలాంటి దోషం లేకుండా వ్రతం శుభఫలం ఉంటుందని అంటుంటారు. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణువు దర్శనం చేసుకోవాలి. కుంకుమ, తులసి ఆకులు వేసి దీపం వెలిగించాలి. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామం చేయాలి. ఏకాదశి వ్రతం రోజున అన్నదానం, ఇతరులకు సహాయం చేయడం మంచిదని అంటుంటారు. అయితే ఉపవాసం పూర్తి అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటారు. ఉపవాసం పూర్తి అయిన తర్వాత మరుసటి రోజు నిర్ణీత సమయంలో మాత్రమే విరమించాలి.
పుత్రదా ఏకాదశి కి పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. భవిష్య పురాణం ప్రకారం.. మహిజిత్ అనే రాజుకు సంతానం లేకపోవడంతో ఆయన కష్టం గురించి తన గురువుకు చెబుతాడు. దీంతో అతడు పుత్రదా ఏకాదశి వ్రతం చేయడం వల్ల సంతానం లభిస్తుంది. అంతేకాకుండా పుత్రదా ఏకాదశి వ్రతం చేయడం వల్ల కుమారుడు పుడతారని కొందరు భావిస్తారు. ఈరోజు నా లక్ష్మి, నారాయణులను ప్రత్యేకంగా ఆరాధిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తారు. వైకుంఠ ఏకాదశి తో పాటు పుత్రదా ఏకాదశి రోజున విష్ణు ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు.