Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడంవల్ల అనుకూల ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి ఏదో ఒక రూపంలో సహకారం ఉంటుంది. అలాంటి విషయాలను ఆస్ట్రాలజీ తెలుపుతుంది. ఈ శాస్త్రం ప్రకారం 2023 అక్టోబర్ 8న ఆదివారం 12 రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఇరుగుపొరుగు వారి సహకారం ఉంటుంది. ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్యాలను నెరవేరుస్తారు. ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మరింత మేలు జరుగుతుంది.
వృషభం:
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇష్టదైవాన్ని పూజించాలి.
మిథునం:
కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదరయ్యే ఛాన్స్ ఉంది. అయినా ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. బంధుమిత్రులను కలుస్తారు. శివపూజ చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం:
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచి పనులు చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికతో పూర్తి చేయాలి. శ్రీ లక్ష్మీ దేవిని పూజించడం ఉత్తమం.
సింహం:
ఉద్యోగ, వ్యాపారం చేసేవారికి శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులు ఆటంకాలు లేకుండా సాగుతాయి. ఒక సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. శివారాధన శ్రేష్ఠం.
కన్య:
వాదనలకు దిగొద్దు. లేకుంటే కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. విజయాలకు దగ్గరవుతారు. కొన్ని రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. శ్రీలక్ష్మీదేవిని పూజిస్తే అనుకూల ఫలితాలు.
తుల:
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఒత్తిడిని పెంచుకోవద్దు. ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో తొందరపడొద్దు. హనుమాన్ ను పూజించడం వల్ల మంచి జరుగుతుంది.
వృశ్చికం:
ఇతరుల నుంచి ఆర్థిక సాయం పొందుతారు. లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనులను పూర్తి చేసేందుకు ముందుకు సాగాలి. శివుడిని ఆరాధిస్తూ బిల్వాష్టకం చదవాలి.
ధనస్సు:
కొన్ని పనుల్లో పక్కనున్నారి సహయం తీసుకోవచ్చు. ఉద్యోగ, వ్యాపారాల్లోని వారికి అనుకూలం. నిరాశ చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగాలి. దుర్గాదేవని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.
మకరం:
అవసరానికి ఆదాయం అందుతుంది. ఒక ముఖ్య వ్యవహారాల్లో సంపూర్ణ సహాయం అందుతుంంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సూర్యభగవానుడి ఆరాధన మంచిది.
కుంభం:
ఉద్యోగం చేసేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అధికారులు మీపై సానుకూలత ఉండకపోవచ్చు. కానీ ఓర్పుతో ముందుకు సాగాలి. కలహాలకు దూరంగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. నవగ్రహ శ్లోకాలు చదవడం అనుకూల ఫలితాలు.
మీనం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మానసిక ఇబ్బందులకు ఆస్కారం. అయితే శ్రీ లక్ష్మి నమస్కారం మనశ్శాంతికి మార్గం.