Today June 30 Horoscope: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల ఉద్యోగులు చేపట్టిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు మాత్రం ప్రత్యర్థుల బెడద ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ పై దృష్టి పెడతారు. ఆస్తుల విలువలు ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. పెండింగ్ పాలనలో పూర్తి చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. వ్యాపారులకు అనుకొని ఆదాయం సమకూరుతుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు ఉండదు. శక్తికి మించిన పనులను చేయకుండా ఉండాలి. ఉద్యోగులు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఏదైనా పని చేసేటప్పుడు శ్రద్ధ పెంచాలి. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి శ్రమిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. అయితే ఇదే సమయంలో ఆదాయం కూడా సమకూరుతుంది. కొన్ని ఆలోచనలు వ్యాపారానికి లాభాలను తీసుకొస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ పాటించాలి. సమాజంలో గౌరవ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. వ్యాపారులో భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడులు పెడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య సమస్యలు వెంట ఆడుతాయి. అయితే డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. విలాస వస్తువులు కొనుగోలు విషయంలో వాయిదా వేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఏర్పడితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కెరీర్ కి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు కొత్త వ్యక్తులను కలుస్తారు. వీరితో అనేక లాభాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు అదరపు ఆదాయాన్ని పొందుతారు. కెరీర్ కు సంబంధించిన ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి ఆరోగ్యం ఈరోజు మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేయడంతో సంతృప్తి చెందుతారు. ఉద్యోగులు చేసిన ప్రయత్నాలకు ఫలితాలు ఉంటాయి. మానసికంగా ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీంతో కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. స్నేహితులతో కలిసి వీఆర్ యాత్రలకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వ్యాపారం గురించి చర్చలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత లక్ష్యాలను పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రశాంతమైన జీవితం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్త వహించాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. విద్యార్థులు కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. అయితే వీరికి తల్లిదండ్రుల సలహా ఇస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణ ఉండనుంది. ఏదైనా పనిని ప్రారంభిస్తే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓ ప్రముఖమైన వ్యక్తిని కలవడం వల్ల లాభాల గురించి చర్చిస్తారు. పూర్వీకుల ఆస్తి పై కీలక సమాచారం పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడతారు. ఉద్యోగులు ప్రాజెక్టుల విషయంలో కాస్త ఒత్తిడి తీసుకొస్తారు. అదనపు బాధ్యతలు పొందడం వల్ల బిజీ వాతావరణంలో ఉంటారు. చట్టపరమైన విషయంలో చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది.