Today June 26 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఏ రోజు ఇంటి నిర్మాణం కోసం ఖర్చులు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు. వివాత్మక అంచనాలతో ముందుకు వెళ్తారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడును భవిష్యత్తులో లాభాలను తీసుకువస్తుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యార్థుల కెరియర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. శాంతి సామరస్యంతో మెలగాలి. ఉద్యోగ అవకాశాలపై శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల సంభాషణలో వాదనలకు దిగదు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారి కుటుంబ వాతావరణం ఈరోజు చంద్రవంతంగా ఉంటుంది. కొన్ని విషయాలపై జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో సహనం పాటించాలి. ఉద్యోగులు కొన్ని బాధ్యతలు నుంచి తప్పకుండా. చాలా విషయాలపై ఎక్కువగా ఆలోచించి అనారోగ్యానికి గురి కావొద్దు. వ్యాపారులు కొత్తగా పెట్టే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఒంటరిగా ఉన్న వారి జీవితం సంతోషంగా మారుతుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. లక్ష్యాలను పూర్తి చేయడానికి అధికారుల నుంచి మద్దతు పొందుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపైనమైన పెట్టుబడులతో లాభాలు ఉంటాయి. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం చేయడం వల్ల లాభాలు ఉంటాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులారాశి వారికి ఈరోజు మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అయితే శాంతి కోసం మౌనంగా ఉండటమే మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగులు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే భాగస్వాముల అండతో వెంటనే పరిష్కరించుకుంటారు. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో లాభాలు వస్తాయి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు స్థిరమైన ఆదాయం ఉంటుంది.. మీరు ఏదైనా పని చేసే సమయంలో కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. అయితే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు. గతంలో చేపట్టిన వాటిని విజయవంతంగా పూర్తి చేయడంతో ప్రశంసలు పొందుతారు. పదోన్నతి కూడా పొందే అవకాశం ఉంటుంది. కెరీర్ కి సంబంధించి శుభవార్తలు వింటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు అభివృద్ధి పై కీలక నిర్ణయం తీసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులపై చర్చించుకుంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కుంభ రాశి వారు ఈ రోజు ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. కొందరు ఇచ్చే సలహాలపై ఆలోచించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు సహనంతో ఉండాలి. చేపట్టిన ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. చిన్న పనికి పెద్దగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా ప్రాజెక్టులు చేపడతారు.